ప్రజాప్రతినిధి ఈ మాటకు అర్థం ప్రజల తరపున ఒక ప్రతినిధి ప్రాతినిధ్యం వహించడం. సమస్యలను సామరస్యంగా పరిష్కరించాల్సిన వీరు ఏకంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొని, ఆ విమర్శలు వ్యక్తిగతంగా దూషించుకోవడం వరకు వెళ్ళి ఇలాంటి వీళ్లా మనలను పరిపాలించేది అని ప్రజలు అనుకునేలా తమ పరువును, గౌరవాన్ని తామే మంటగలుపుకుంటున్నారు.


ఇటీవల తెలంగాణలోని అసెంబ్లీలో కోమటిరెడ్డి హెడ్ ఫోన్స్ విసిరి సస్పెన్షన్ కు గురయిన సంగతి తెలిసిందే. తాజాగా గుజరాత్ అసెంబ్లీలో ఇంతకన్నా ఘోరమైన సీన్ రిపీట్ అయింది. అధికార, ప్రతిపక్ష నాయకులు ఇరువురూ కలిసి ముష్టి యుద్దానికి దిగారు. మొదట చిన్న చిన్న విమర్శల తీరుతో మొదలయిన ఈ గొడవ ఆ తరువాత వ్యక్తిగత దూషణలకు వెళ్ళి ఒకరిపై ఒకరు చేయిచేసుకొనేంతవరకు వెళ్ళింది. పీఎం సొంత ఇలాకాలోనే ఇలా జరగడం పలు విమర్శలకు దారితీస్తుంది.


నిన్న అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ మరియు బీజేపీ ఎమ్మెల్యే జగదీశ్ సభలో అందరూ చూస్తుండగానే పరుషపదజాలంతో దూషణలకు దిగారు. అంతటితో ఆగని వారిరువురూ ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుప్పించుకొని ముష్టి యుద్దానికి పాల్పడ్డారు. ఇద్దరిని విడిపిద్దామని సభ్యులు ప్రయత్నించినా వారివల్ల కాలేదు సరిగదా ఏకంగా ఇరుపక్షాల సభ్యులు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడి సభాగౌరవాలని మంటలో కలిపారు. ఈ విషయంపై సీరియస్ అయిన స్పీకర్ ప్రతిపక్ష నాయకులని సభ నుండి సస్పెండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: