ఈ చిత్రమైన విషయం మీకు తెలుసా? భారతీయులు సంతోషంగా లేరట.. పాకిస్థాన్‌ పౌరులు మాత్రం చాలా హాయిగా గడిపేస్తున్నారంట. తాజాగా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన "ప్రపంచ సంతోషకరమైన దేశాలు" జాబితా లో భారత్‌ వెనుక్కు పడిపోయింది. ఈ 2017 నివేదిక ప్రకారం భారత్‌ 4 స్థానాలు క్రింది పడిపోగా, తాజాగా విడుదల చేసిన 2018 నివేదిక లో యకాయకీ 11 స్థానాల కిందికి పడిపోయింది.

మొత్తం 156దేశాల సంతోషవంతమైన దేశాల జాబితాను ఐక్య రాజ్య సమితి విడుదల చేయగా అందులో 133వ ర్యాంకు తో భారత్‌ సరిపెట్టుకోవలసి వచ్చింది. ప్రతి ఏడాది ఐరాసకు చెందిన "సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ సొల్యూషన్స్‌ నెట్‌వర్క్‌ - ఎస్‌డీఎస్‌ఎన్‌" ఈ నివేదికను సిద్ధం చేస్తుంది. 

Image result for world happiness report 2017

భారత్‌ ర్యాంకుతో, నిత్యం ఉగ్రవాదం సమస్యతో, ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న, పాకిస్థాన్‌ను పోలిస్తే, "పాకిస్తాన్ లో ప్రజలు ఆనందంగా, హాయిగా, సంతోషంగా  జీవితాలు హడుపుతున్నట్లు" ఈ నివేదిక వెల్లడించింది. 2017లో ర్యాంకులు ప్రకటించినప్పుడే భారత్‌ కంటే మెరుగైన ర్యాంకును సాధించిన పాక్‌ మరోసారి 2018 నివేదికలో కూడా అదే పైచేయి సాధించింది. 

Related image

అంతే కాదు గత ఏడాది కంటే మరో 5 ర్యాంకులు పైకి ఎగబాకింది. ప్రస్తుతం పాక్‌ 75 ర్యాంకు తో భారత్‌ కంటే మెరుగ్గా చాలా ముందున్నట్లు ఐక్య రాజ్య సమితి వెల్లడించింది. అంతే కాదు, భారత్‌ కంటే చిన్న దేశాలైన బంగ్లాదేశ్‌, భూటాన్‌, నేపాల్‌, శ్రీలంక వంటి దేశాలు కూడా "హ్యాపియెస్ట్‌ కంట్రీల జాబితా" లో భారత్‌ కంటే ముందున్నాయి. ఇక చైనా కూడా భారత్‌ కంటే ఎంతో ముందుంది. 2017 లో భారత్ 122 రాంక్ లో ఉందగా పాకిస్తాన్ 80, నేపల్ 99 భూటాన్ 97వ రాంకులో మనల్ని చూసి పగలబడి నవ్వుతున్నాయి. బంగ్లాదేశ్ 110 శ్రీలంక 120 రాంకులలో నిలిచి మనకంటే ముందు ఆనందంగా ఉంతున్నట్లు తెలుస్తుంది ఈ నివేదిక ద్వారా. 
Image result for world happiness report 2017
2018 లో భారత్ 133 రాంకు కు పడిపోయి సార్క్ దేశాల్లో చివరకు చేరింది. అంటే గత సంవత్సరం కంటే 11 రాంకులు దిగజారిందన్న మాట. ఇక్కడ పాకిస్తాన్ 75, నేపల్ 101, భూటాన్ 97 సృఈలంక 116, బంగ్లాదేశ్ 115 తో సరిపెట్టుకున్నాయి.

ఇక ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన జాబితాలో తొలిస్థాన్‌ ఫిన్‌లాండ్‌ దక్కించుకుంది. నార్వే, డెన్మార్క్‌ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఐస్‌లాండ్‌, స్విట్జర్లాండ్‌, నెదర్లాండ్‌, కెనడా, న్యూజిలాండ్‌, స్వీడన్‌, ఆస్ట్రేలియా తరువాత స్థానాల్లో నిలిచాయి. 

ఇక అసంతప్తికరమైన దేశాల్లో మలావి ప్రథమ, హైతీ ద్వితీయ, లిబేరియా తృతీయ స్థానాల్లో నిలువగా, సిరియా, రువాండా, యెమెన్‌, టాంజానియా, దక్షిణ సుడాన్‌, సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌, బురుండి తరువాత స్థానాల్లో నిలిచాయి.

Image result for world happiness report 2018

మరింత సమాచారం తెలుసుకోండి: