రాష్ట్రంలో పొలిటిక‌ల్ హీట్ పెరిగింది. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో ఇప్పుడది తారాస్థాయికి చేరుకుంది. టీడీపీ టార్గెట్ గా సాగిన ప‌వ‌న్ ప్ర‌సంగం.. ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది. టీడీపీతో ఇక ఎంతమాత్రం సంబంధాలు ఉండవన్న పవన్.. ఇకపై ఎవ‌రితో జ‌త క‌డ‌తాడ‌రనేదాపైనే ఇప్పుడు అంద‌రి దృష్టి ఉంది. అసలు జ‌న‌సేనాని వ్యూహమేంటి? ప‌వ‌న్ ప్ర‌సంగం వెనుక కార‌ణాలేంటి? భ‌విష్య‌త్ లో రాజ‌కీయ ప‌రిణామాలు ఎలా మారబోతున్నాయి.?

Image result for pawan kalyan AND JAGAN

నాలుగేళ్లు సైలెంట్ గా ఉన్న ప‌వ‌న్ కళ్యాణ్ ఒక్క‌సారిగా త‌న స్వ‌రంలో సాంద్ర‌త పెంచారు. ప‌నిలోపనిగా తాను టీడీపీ భాగస్వామినన్న ముద్ర‌ను చెరుపుకునే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో ఒక్క‌సారిగా పొలిటిక‌ల్ వాతావ‌ర‌ణం హీటెక్కింది. ఇప్ప‌టి వ‌ర‌కు మిత్ర‌ప‌క్షంగా ఉన్న ప‌వ‌న్ ఒక్క‌సారిగా టీడీపీ పాల‌నతో పాటు నేత‌ల‌పై కూడా విరుచుక‌ప‌డ‌డం ఇప్పుడు అంత‌టా చ‌ర్చ‌నీయాంశమైంది..

Image result for pawan kalyan AND JAGAN

టీడీపీ పాల‌న‌తో దగా ప‌డ్డ వాళ్లే త‌న స‌భ‌కు ముఖ్య అతిథులుగా ప‌వ‌న్ చెప్ప‌డం.. ఆపార్టీ నేత‌ల‌కు మింగుడు ప‌డ‌డం లేదు. తాజా ప‌రిణామాల‌తో ఏపీలో పొలిటిక‌ల్ ఈక్వేషన్స్ జోరుగా మారిపోతున్నాయి. పవన్ టార్గెట్ టీడీపీ నినాదం ఎత్తుకున్న నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష‌ వైసీపీ, కేంద్రంలో అధికార బీజేపీ ఈ ప‌రిణామాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నాల‌కు జోరుగా తెర వెనుక పావులు క‌దుపుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేనానిని త‌మ వైపు తిప్పుకుంటే త‌మ‌కు అధికార పీఠం ఖాయమనే భావ‌న‌లో ఆ పార్టీ నేత‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాబోయే రోజుల్లో కీల‌క రాజ‌కీయ ప‌రిణామాలు జ‌రిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ, బీజేపీ, జ‌న‌సేన ఒకే వేదిక‌పై నుంచి ఎన్నిక‌ల్లోకి వెళ్లే అవ‌కాశాలు లేక‌పోలేద‌నే వాదనలు వినిపిస్తున్నాయి..

Image result for pawan kalyan AND JAGAN

రాష్ట్రంలో బీజేపీ తన‌కు తానుగా అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో... ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో జ‌త క‌ట్టాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే టీడీపీతో పొత్తు దాదాపు క‌టీఫ్ అయిన తరుణంలో బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీల వైపు చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో వైసీపీ, బీజేపీ లిస్టులో ముందున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ కూడా ఇందుకు స‌ముఖంగా ఉన్న‌ట్లు పార్టీ వ‌ర్గాల సమాచారం. దీంతో భవిష్య‌త్ లో వైసీపీని, జ‌న‌సేనని క‌లుపుకొని పోయి రాష్ట్రంలో అధికార పీఠం ఎక్కాల‌ని కమ‌నాథులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వ్యూహ‌త్మ‌కంగా టీడీపీని బ్లేమ్ చేసే విధంగా పావులు కదుపుతున్న‌ట్లు తెలుస్తోంది..

Image result for pawan kalyan AND JAGAN

ప‌వ‌న్ ప్ర‌సంగంలో అంశాల‌ను ప‌రిశీలించిన ఈ రెండు పార్టీలు.. వాటిని త‌మ‌కు అనుకూలంగా మలుచుకునేందుకు స‌న్నాహాలు చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ప‌వ‌న్ ఎవ‌రితో క‌లిసి వెళ్త‌తాడ‌నేది ఇప్పుడు చెప్ప‌లేక‌పోయినా.. తాజా రాజ‌కీయ ప‌రిణామాలు మాత్రం అందుకు అనుకూలంగానే ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: