దమ్ముంటే మోడీ సర్కారుపై అవిశ్వాసం పెట్టు.. లేదా నేను అవిశ్వాసం పెడతా.. నువ్వు మద్దతు ఇవ్వు... చంద్రబాబు తోకలా ఉండే పవన్ కల్యాణ్ అవిశ్వాసానికి చంద్రబాబును ఒప్పించాలి.. ఇవీ కొన్ని రోజుల క్రితం పాదయాత్రలో జగన్ విసిరిన సవాల్.. అప్పట్లో ఈ సవాల్ చూసి అహా.. జగన్ భలే ఎత్తు వేశాడురా అనుకున్నారంతా.. ఎందుకంటే అది జరిగే పని అని ఎవరూ అనుకోలేదు..

Image result for jagan padayatra LATEST

ఎలాగూ చంద్రబాబు మోడీపై అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడు.. సో.. అవిశ్వాసం అనేది టీడీపీని బెదిరించి ఏపీ ప్రజల్లో హీరోగా నిలిచేందుకు పనికొస్తుందని జగన్ భావించాడు. కానీ ఇప్పుడు సీన్ మారింది. చంద్రబాబు మోడీతో తెగదెంపులకు రెడీ అయ్యాడు. సో.. ఇప్పుడు అవిశ్వాసమే కాదు.. దేనికైనా రెడీ అంటున్నాడు. మొదట్లో వైసీపీ అవిశ్వాసాన్ని తప్పుబట్టిన టీడీపీ ఇప్పుడు అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. 


వైసీపీ పెట్టే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని టీడీపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఏకంగా చంద్రబాబు అసెంబ్లీలోనే చెప్పేశారు. కేంద్రంపై ఎవరు పోరాటం చేసినా మేం మద్దతిస్తాం.. కానీ లాలూచీ రాజకీయాలు సరికాదంటూ చంద్రబాబు అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. పాపం.. ఇక ఇప్పుడు జగన్ అవిశ్వాసం పెట్టి తీరాల్సిందే.


మరి ఈ జగన్ పార్టీ అవిశ్వాసాన్ని మోడీ సర్కారు ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి. మోడీ కాస్తా ఆగ్రహించిన జగన్ పై కేసుల విచారణను వేగవంతం చేస్తే అసలుకే ఎసరు వస్తుందని టీడీపీ నాయకులు కౌంటర్లు వేస్తున్నారు. మరి అలాంటి పరిస్థితి వస్తుందా.. అప్పుడు వైసీపీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: