పవన్ కల్యాణ్ టీడీపీని వదిలిపెట్టి.. ఇప్పుడు పవన్ కల్యాణ్ కు దగ్గరవుతున్నాడా.. అంటే అవుననే అనిపించేలా ఉంటున్నాయి ఒక్కో పరిణామం.. ఈ మేరకు ఓ వైసీపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. పార్లమెంటు ప్రాంగణంలో వైసీపీ ఎంపీ వరప్రసాద్ .. జనసేనపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తోనే జనసేన ఉంటుందని ఢంకా భజాయించి చెప్పారు. 


కొద్దిరోజుల క్రితం పవన్ కల్యాణ్ ఫోన్ చేసి కలవాలని అడిగితే వెళ్లానని ఆయన తెలిపారు. వైసీపీ తనపై ఎందుకు విమర్శలు చేస్తోందని ఈ సందర్భంగా పవన్ అడిగినట్లు చెప్పారు. వైసీపీని అవినీతి పార్టీ అని మాట్లాడుతున్నేందునే విమర్శిస్తున్నామని తాము చెప్పినట్లు తెలిపారు. పోలవరం సందర్శనకు తాము వెళ్తున్నామని తెలిసి..మీరు ముందే అక్కడికి వెళ్లారని ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడినందుకే  విమర్శలు చేశామని పవన్ తో చెప్పినట్లు వరప్రసాద్  వివరించారు.


అప్పుడు పవన్ వరప్రసాద్ కు క్లారిటీ ఇచ్చారట. తాను టీడీపీతో ఎంత మాత్రం ఉండటం లేదని చెప్పారట. అంతే కాదు.. అవసరమైతే జగన్ కే మద్దతిస్తానని పవన్ చెప్పినట్లు వరప్రసాద్  చెప్పారు. ఎన్నికల తర్వాత జగన్ కు అవసరమైతే జనసేన ఎమ్మెల్యేల మద్దతు కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు వర ప్రసాద్ బాంబు పేల్చారు. ప్రజారాజ్యంలో కలిసి పనిచేసిన చనువుతోనే పవన్ తనతో మాట్లాడారట. 

Image result for VARA PRASAD

వైసీపీ విధానాలు నచ్చి ఎవరు కలిసొచ్చినా తమకు అభ్యంతరం లేదని మరో వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వైసీపీ, జనసేన పార్టీలు కలిసిపోతాయా లేదా అన్న అంశం ఇప్పుడు అప్రస్తుతమని పొత్తులపై వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఎంపీ వరప్రసాద్‌ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను కలిసిన విషయం తమ దృష్టికి రాలేదని బొత్స స్పష్టం చేశారు. వారిద్దరి మధ్య ఏమి చర్చ జరిగిందో ఎంపీ వరప్రసాద్‌తోనే అడగాలని సూచించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: