లోక్ సభలో మొత్తం సభ్యుల సంఖ్య 543. ఇప్పుడున్న బలాబలాల ప్రకారం కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి  సభ్యుల సంఖ్య 272 అంటే ఒకటి ఎక్కువ కాదు తక్కువా కాదు. ఏ ఒక్క బాజపా ఎంపి జారిపోయినా బాజపా స్వంత బలం మెజారిటీకి సరిపోదు. మిత్రుల బలం కలిపితేనే క్షేమం. దీన్ని బట్టి బాజపా కేంద్రంలో అనుకున్నంత బలంగా లేనట్లే. 2014 అఖండ విజయం తరవాత క్రమంగా తన ప్రభ కోల్పోతూ వస్తుంది.  అత్తెసరు మార్కులతో చదివే విద్యార్ధి లాగా అన్నమాట.  బాజపా మున్ముందు కష్టాలు తప్పేలా లేవు. ఆ పార్టీకి చెందిన భాగస్వామ్య పక్షాలు ఒక్కొక్కటిగా హ్యాండిస్తూ వస్తున్నాయి. దీంతో గతంలో తిరుగులేని కూటమి లేదా ప్రభుత్వంగా ఉన్న బీజేపీ ఇపుడు అత్తెసరు మార్కులతో కాలాన్ని వెళ్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

Related image 

 నిజానికి 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 335 సీట్లు రాగా, ఒక్క బీజేపీకే 282 సీట్లు వచ్చాయి. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినంత మెజారిటీని దక్కించుకుంది. అయితే, తర్వాత కాలంలో బీజేపీ బలం అంతకంతకూ తగ్గుతూ వస్తోంది. సభ్యులు మరణించినపుడు జరిగే ఉప ఎన్నికల్లో తిరిగి బీజేపీ అభ్యర్థులు గెలవకపోవడం ఇందుకు ప్రధాన కారణం. 

Image result for bjp number of mps in parliament 

తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో రెండు సీట్లు కోల్పోవడంతో బీజేపీ బలం 272కు పడిపోయింది. ఇది సరిగ్గా అత్తెసరు మార్కులతో కూడిన మెజార్టీలో ఉంది. ఇందులో ఏ ఒక్క ఎంపీ హ్యాండిచ్చినా సాంకేతికంగా ప్రధాని మోడీ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయినట్టే. నాలుగేళ్ల క్రితం బీజేపీకి 282 సీట్లు వుండగా ఇపుడు ఆ సంఖ్య 272 కు పడిపోయింది. మొత్తం మీద ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు ఇపుడు బొటాబొటి మెజార్టీతో అధికారంలో కొనసాగుతోంది. 

 Image result for bjp number of mps in parliament

మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 44 సీట్లతో అత్యంత అవమానకరమైన ఓటమిని చవిచూసిన కాంగ్రెస్‌ పార్టీ ఈ నాలు గేళ్లలో నాలుగు సీట్లు పెంచుకుంది. బీజేపీకి 10 సీట్లు తగ్గాయి. దేశవ్యాప్తంగా 7 సీట్లకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటి ఫలితాలు మరికొన్ని పార్టీల భవితను నిర్దేశించ నున్నాయి. మిత్రులను వదిలేస్తే రానున్న కాలంలో బాజపా పరిస్థితి ధారుణంగా ఉండవచ్చు. బీజేపీకి మెజార్టీ అత్యల్పం ఒక్క ఎంపీ మొండి చేయి చూపినా ప్రభుత్వం మైనార్టీనే. కేంద్రంలో బాజపా నరెంద్ర మోదీ అంత బలంగా లేరు - సంఖ్యాబలం బొటాబొటీనే! 

 Image result for bjp number of mps in parliament

మరింత సమాచారం తెలుసుకోండి: