నేను చనిపోతుంటే నువ్వు చూడాలి.. నువ్వు చూస్తే నాకు సంతోషం.. ఇదీ ఓ ప్రేమికుడు ప్రియురాలికి పంపిన మెస్సేజ్.. వెంటనే వీడియో కాల్ లోకి రా.. నా చావు చూడు అంటూ ఆ కుర్రాడు పెట్టిన మెస్సేజ్ చూసి ఆ యువతి లైట్ గా తీసుకుంది. ఆట పట్టిస్తున్నాడనుకుంది. కానీ అంతలోనే ఆ కుర్రాడు తాను అన్నది నిజం చేశాడు. నిజంగానే ఊరేసుకున్నాడు. 


ఈ ఘటన హైదరాబాద్ లోని నేరెడ్ మెట్ ప్రాతంలో కలకలం సృష్టించింది. ఐటీఐ డిప్లొమా చేస్తున్న అజ్మిరా సాగర్ యువకుడు తాను ప్రేమించిన యువతి దూరమైందని ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసులకు అతని ఫోన్ లో ప్రియురాలితో వాట్సాప్‌ వీడియో చాటింగ్‌ వీడియో కనిపించింది. ఆ వీడియోలో ఆమె చూస్తుండగానే ఉరి వేసుకున్నట్లు పోలీసులు నిర్దారించారు. 


రాజమండ్రికి చెందిన ఓ యువతి గత ఏడాది బీఎస్సీ నర్సింగ్‌ చదవడానికి నగరానికి వచ్చింది. అప్పుడు ఆమెకు సాగర్‌తో పరిచయమైంది. ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. ఇరు కుటుంబాల పెద్దలూ మందలించడంతో నాలుగు నెలలుగా దూరంగా ఉంటున్నారు. ఇటీవల సాగర్‌ పెళ్లి చేయాలని అతని ఇంట్లో పెద్దలు నిశ్చయించారు. దీంతో సాగర్‌ తీవ్ర మనస్తాపానికి గురై ప్రియురాలితో వాట్సాప్‌లో చాటింగ్‌ చేశాడు.



 ‘నేను చనిపోతే నువ్వు చూడాలి... నేను సంతోషిస్తాను. తొందరగా వీడియో కాల్‌ చెయ్‌ నేను చనిపోతున్నాను’ అని ఆ యువతికి వాట్సప్‌ మెస్సేజీ పంపడంతో వీడియో కాల్‌ మొదలైంది. ఆ యువతి చూస్తుండగానే సాగర్‌ పడకగది పైకప్పునకు చీరను కట్టి ఉరి వేసుకొని ఆత్మహత్మ చేసుకున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: