ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందే.. అబ్బే.. ప్రత్యేక హోదా అవసరం లేదు.. ప్రత్యేక ప్యాకేజీ చాలు.. లేదులేదు.. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. అదేంలేదు.. హోదా, ప్యాకేజీ రెండూ ఒకటే.. పెద్దతేడా లేదు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ ప్రవేశ పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తాం.. అరెరె.. అలా ఎలా కుదురుతుంది.? వాళ్లకు మద్దతు ఇవ్వడం ఏమిటి.. మేమే స్వయంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతాం.. ఇల ఒకదానికొకటి పొంతనలేని మాటలేమిటి.. ఎవరు చెప్పారనీ ఆలోచిస్తున్నారా..? అయినా ఇందులో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం.
Image result for tdp
ఒక్కక్షణం పై వ్యాఖ్యలపై దృష్టి పెడితే ఈజీగా తెలిసిపోతుంది ఆ మాటలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడివి అని.  రాష్ట్ర విభజన సమయంలో కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టి, నాలుగేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంతో కలిసి నడిచిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎట్టకేలకు తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు.
Image result for ysrcp
ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని బీజేపీ తేల్చి చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు. అదికూడా ఎన్డీయే నుంచి బయటకు రాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రమే బయటకు వస్తున్నామంటూ ఇద్దరు మంత్రులతో రాజీనామా చేయించారు. అదేసమయంలో రాష్ట్రంలోని ఇద్దరు బీజేపీ మంత్రులు కూడా రాజీనామా చేశారు.  అయితే ఏమాత్రం అవకాశం ఉన్నా.. ఎన్డీయేలోనే కొనసాగేందుకే చంద్రబాబు మొగ్గు చూపినట్లు సమాచారం.
Related image
కానీ గుంటూరు సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేయడం, కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించడంతో చంద్రబాబు ఒక్కసారిగా వ్యూహం మార్చుకున్నారు. ఎన్డీయేలో కొనసాగడం ఇక ఎంతమాత్రమూ మంచిదికాదని అప్రమత్తం అయిన చంద్రబాబు ఎన్డీయేతో బంధం తెంపుకున్నారు.  వైసీపీ అధినేత దూకుడుతో చంద్ర‌బాబు త‌న వ్యూహాన్ని మార్చుకోక త‌ప్ప‌లేదు. నాలుగేళ్ల పాటు బీజేపీతో కలిసి ఉండి.. ఎన్నికలకు మరో ఏడాది ఉండగా చంద్రబాబు బయటకు వచ్చింది కేవలం రాజకీయ ప్రయోజనాలకోసమేననే విమర్శలు వచ్చిపడుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: