విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కి తీరని అన్యాయం జరిగిందంటూ..మొదటి నుంచి పోరాడుతున్న వైసీపీ కొంత కాలంగా దూకుడు పెంచింది. కాంగ్రెస్ విడగొట్టి అన్యాయం చేస్తే.. బీజేపీ పార్టీ విడిపోయిన రాష్ట్రానికి కనీసం అవసరాలు తీర్చకుండా చేసింది.  అంతే కాదు ఈ మద్య కేంద్రం ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని..దానికి బదులు ప్యాకేజ్ రూపంలో ఇప్పటి వరకు ఎంతో ఇచ్చామని చెప్పింది. దాంతో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.   
Image result for ap special status
ఈ నేపథ్యంలో వైసీపీ ప్రజా పక్షాన పోరాడుతున్న వైసీపీ   రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా.. హక్కులను హరించారంటూ ఉద్యమం చేపట్టింది.  ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని వైసీపీ నేత వైఎస్ జగన్ ‘ప్రజా సంకల్ప యాత్ర’ మొదలు పెట్టిన విషయం తెలిసిందే.  ఓ వైపు ప్రత్యేక హోదా కోసం తన ఎంపీలతో పోరాటం చేపిస్తూనే..మరోవైపు ప్రజల వద్దకు పాదయాత్రతో చైతన్యం తెస్తున్నారు. 
Image result for ap special status parliament protest
ఏపీకి హోదా ఇవ్వలేమని, ఫ్యాకేజీయే ఇస్తామని కేంద్రం తెల్చి చెప్పింది. అయినా జగన్ పట్టువిడవకుండా పొరాడుతున్నాడు. చివరికి హోదా అంటే జైల్లో వేస్తానన్న చంద్రబాబు చేత అవిశ్వాసానికి జై కొట్టించారు. ఇప్పటికే అవిశ్వాసానికి సంబంధించిన నోట్ ను స్పీకరుకు అందించిన వైసీపీ, సోమవారం రోజు మరో సారి ఇచ్చేందుకు సిద్దమవుతుంది.

వైసీపీకి 120 మంది ఎంపీల మద్దతు కూడగట్టింది. కాంగ్రెస్ నుంచి 48, తృణమూల్ కాంగ్రెస్ నుంచి 34.శివసేన నుంచి 18. సీపీఎం నుంచి 9, ఏస్పీ నుంచి 7. ఆమ్ ఆద్మీ నుంచి 4గురు ఎంపీల మధ్దతు సంపాదించింది వైసీపీ.  ఏది ఏమైనా ఇప్పుడు వైసీపీ టైమ్ నడుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: