ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సమయంలో మిత్ర పక్షంగా ఉన్న టీడీపీ, బీజేపీ ఇప్పుడు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.  విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన కేంద్రం ఇప్పటి వరకు పట్టించుకోకుండా ప్రజల ఆగ్రహానికి గురయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపిస్తున్నారు.   ప్రజా పక్షం వహిస్తున్న బాధ్యత గల నాయకుడిగా కేంద్రంతో అమీ తుమీ తేల్చుకునేందుకు రెడీ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 

మోడీ కాచుకో.. ఇక మిమ్మల్ని వదిలేది అని చెప్పిన చంద్రబాబు ఆ వెంటనే కార్యాచరణకు దిగారు. “ఇక మీతో తేల్చుకుంటాం. హక్కులడిగితే బెదిరిస్తారా… అవహేళనగా మాట్లాడతారా” అంటూ గర్జించిన చంద్రబాబు. ఏపీకి చేసిన మోసానికి మీ సంగతి చూస్తాం అని ప్రకటించిన చంద్రబాబు మోడీ ప్రభుత్వ కూసాలు కదిలించే వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.
Image result for ap special status
నాలుగేళ్ళ పాటు మిత్రపక్షంగా ఉన్న బీజేపీతో ఇంతకాలం సర్దుకుపోతూ వస్తున్న చంద్రబాబు మంత్రుల రాజీనామా తరువాత క్రమంగా విమర్శలను ఎక్కుపెట్టడం మొదలుపెట్టాడు.తెలుగు రాష్ట్రాల్లో సీట్లు పెంచకపోవడం కేంద్రం చేస్తున్న రాజకీయం కాదా ? అంటూ ఆయన ప్రశ్నించారు.ఇదిగో ఇస్తాం… అదిగో ఇస్తామని విభజన హామీలు నెరవేర్చకుండా, నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు మోడీని ఉద్దేశించి అనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 
Image result for ap special status
అంతే కాదు..అమరావతి ప్రారంభోత్సవానికి ప్రధాన మంత్రిని గౌరవంగా ఆహ్వానిస్తే ఇంత మట్టి, నీరు తెచ్చి ఇచ్చినప్పుడు రాజధాని అభివృద్ధిలో భాగస్వాములవుతారని అనుకున్నామని, ఇలా దగా చేస్తారని మాత్రం ఊహించలేదని చంద్రబాబు విమర్శించారు.

ఇక నీ మాటలు ఎవరూ నమ్మరని, ప్రజలకు వాస్తవాలు తెలుసని చంద్రబాబు అన్నారు. నవీన ముంబైకి 42 వేల ఎకరాలు, గాంధీ నగర్ కు 32 వేల ఎకరాలు కొన్నప్పుడు అమరావతికి 32వేల ఎకరాలు ఎందుకు ఉండకూడదు? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: