జనసేన రాబోయే ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ లతో కలిసి పోటీ చేస్తుందని అంటున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రాష్ట్ర సమస్యలపట్ల వామపక్ష పార్టీలు జనసేన కలిసి పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో తన మీద వస్తున్న అపోహలను అనగా చేస్తున్నాయని.. తాను భాజపా డైరెక్షన్ లో నడుస్తున్నానని తెదేపా, తెదేపా డైరెక్షన్ లో నడుస్తున్నానని వైకాపా ఇలా రకరకాలుగా ఆరోపిస్తుంటారని.. కానీ తాను ఎప్పటికీ.. ప్రజల డైరెక్షన్ లోనే నడుస్తానని ఆయన ప్రకటించారు.


అంతేకాకుండా తనకు చిన్నప్పటి నుండి కమ్యూనిస్టు సిద్ధాంతాలు అంటే చాలా ఇష్టమని అన్నారు….ఎందుకంటే ఎక్కడైతే ప్రజా సమస్యలు ఉంటాయో అక్కడ వామపక్ష పార్టీలు ఉంటాయంటూ కితాబులు ఇచ్చారు.


అందుకే తాను ఆ పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నట్లు చెప్పారు. వాస్తవంగా గత కొంత కాలం నుండి వామపక్ష నాయకులతో పవన్ కళ్యాణ్ టచ్ లోనే  ఉన్నారు. మొత్తంమీద పవన్ కళ్యాణ్ అధికారం కోసం కాకుండా రాష్ట్రంలో మొదట సమస్యల పట్ల పోరాటం చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.


అయితే ఈ క్రమంలో జనసేన పార్టీని వ్యవస్థాగత నిర్మాణం చేయటానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా జనసేన పార్టీ సభ్యత్వం కోసం సోషల్ మీడియాలో ఒక వెబ్ సైట్ ఓపెన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు పవన్….అలాగే పార్టీకి సంబంధించి ఒక ఫోన్ నెంబర్ జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులకు అందుబాటులో ఉండేలా పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: