మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. అయినా ఇంకా కామాంధుల నుంచి మాత్రం వారికి ఇబ్బందులు తప్పడంలేదు.. చిన్న చితకా ఉద్యోగాలు చేసుకునే మహిళల నుంచి అత్యున్నత స్థానాల్లో ఉన్న మహిళలకు సైతం ఇలాంటి పోకిరీ గాళ్ల నుంచి వేధింపులు కామన్ అయ్యాయి. తాజాగా  లేడీ పైలట్ పై తన కో పైలట్ చేసిన అఘాయిత్యం చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. 

Betty Pina has filed suit against Alaska Airlines in Washington State Superior Court. Paul Engelien (right) is named in Pina’s lawsuit, but not as a defendant.
అమెరికాలోని అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన కోపైలట్‌ బ్రెట్టీ పినా తన పైలట్ ప్రవర్తనపై పోలీసులలకు ఫిర్యాదు చేసింది. సదరు పైలట్ తో కలసి ఒకసారి మూడు రోజులు ప్రయాణించాల్సి వచ్చిందట. ఆ సమయంలో ఆ పైలట్ తనకు వైన్ గ్లాస్ ఇచ్చాడట. అది తాగిన తర్వాత బ్రెట్టీ స్పృహ కోల్పోయిందట. ఆ తర్వాత కళ్లు తెరచి చూస్తే ఇంకేముంది.. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. 

PHOTO: Betty Pina, an Alaska Airlines pilot who is suing her employer after accusing her co-pilot of rape, spoke out in an interview with ABC News.
బ్రెట్టీకి డ్రగ్స్ ఇచ్చిన వైన్ ఇచ్చిన సదరు పురుష పుంగవుడు.. ఆ తర్వాత ఆమెను గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయంపై మొదట సైలెంట్ గా ఉందామనుకున్నా.. ఆ తర్వాత మరొకరికి ఇలాంటి దారుణం జరగకూడదని నోరు విప్పిందట.  ఆ పైలట్ పై చర్య తీసుకోవాల్సిందిగా సదరు విమానసంస్థపై ఫిర్యాదు చేసినా వాళ్లు పట్టించుకోలేదట. 

Betty Pina, 39, a co-pilot for Alaska Airlines, is suing the airline, claiming Alaska is liable for a captain’s alleged drugging and raping of her, and for its subsequent failure to hold the man accountable after she reported what happened to airline officials. (Erika Schultz/The Seattle Times)
అందుకే.. ఇక లాభం లేదని పోలీసులను ఆశ్రయించింది. బ్రెట్టీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు మీడియాకు ఎక్కడంతో సదరు ప్రైవేటు విమానయాన సంస్థలో కదలికి వచ్చింది. ఈ ఘటన దురదృష్టకరమని దీనిపై విచారణ జరుపుతున్నామని ప్రకటించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: