ఢిల్లీలో రాజకీయం రసవత్తరంగా మారింది. బీజేపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఎన్డీయే కూటమి నుంచి ఒక్కొక్కటిగా మిత్రపక్షాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఆ మిత్రులే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అటు టీడీపీ, వైఎస్సార్ సీపీ పోరాడుతున్నాయి. కలిసి మాత్రం కాదు. ఎవరికి వారుగా.. వేర్వేరుగా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం.. రాజకీయ ప్రయోజనాల కోసం.. ప్రజల ముందు ఉత్తమ ప్రదర్శన కనబరుస్తూ ముందుకు వెళ్తున్నాయి. 

Image result for tdp

ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం పూటపూటకూ ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ఇక్కడ మరో విషయం గురించి మాట్లాడుకోవాలి. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది బీజేపీ, అధికార టీఆర్ఎస్ మధ్య యుద్ధ వాతావరణాకి దారితీసింది. ఆ తర్వాత సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ ఎట్టకేలకు పొరపాటున నోరుజారినట్లు అంగీకరించారు. 

Image result for trs

దేశంలో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో మద్దతు ఇస్తామని ఆయన అన్నారు. కానీ ఆంద్రప్రదేశ్ లో అనూహ్యంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని బీజేపీ తేల్చి చెప్పడం... కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ బయటకు రావడం.. కేంద్రంలో ఇద్దరు టీడీపీ మంత్రులు రాజీనామా చేయడం, రాష్ట్రంలో ఇద్దరు బీజేపీ మంత్రులు రాజీనామా చేయడం.. వైఎస్సార్ సీపీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించడం.. మద్దతు ఇస్తామని టీడీపీ చెప్పడం.. లేదు లేదు తామే స్వయంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతామని టీడీపీ ప్రకటించడం.. ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావడం.. ఇలా ఒక్కరోజులోనే ఢిల్లీలో రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. 

Image result for chandrababu

అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో మద్దతు ఇస్తామని చెప్పిన టీఆర్ఎస్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. నిజానికి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని టీడీపీ, వైఎస్సార్ సీపీ నిర్ణయిండంతో మోడీపై ఒత్తిడి పెరిగింది. అనూహ్యంగా మోడీ వ్యతిరేక పక్షాలు ఒక్కటవుతున్నాయి. టీడీపీ, వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే టీఆర్ఎస్ మాత్రం స్పష్టత ఇవ్వలేకపోతోంది. ప్రత్యేక హోదా కు మద్దతు ఇస్తాం కానీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వబోమని టీఆర్ఎస్ నేతలు చెప్పడం గమనార్హం. 

Image result for kcr

ఇక్కడే మోడీకి కేసీఆర్ కు మధ్య ఓ అవగాహన కుదిరిందనే అనుమానాలు రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. గతంలో కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. కేసీఆర్ మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మళ్లీ ఆ విషయం తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని పసిగట్టిన కేసీఆర్ వెంటనే మంత్రులను, పార్టీ కీలక నేతలను అప్రమత్తం చేశారు. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టాయని, అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 

Image result for modi kcr chandrababu

నిజానికి అప్పటి నుంచి కేసీఆర్ ఫ్రంట్ విషయంలో తప్ప కేంద్రంపై పెద్దగా మాట్లాడకపోవడం గమనార్హం. ఈ విషయం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు రిజర్వేషన్ల పెంపు అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలని ఆందోళన చేస్తున్నట్లు సమాచారం. అందుకే కేంద్ర ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వబోమని టీఆర్ఎస్ ఎంపీలు చెబుతున్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: