వైసీపీ అధినేత జగన్ పై 13 వరకూ చార్జ్ షీట్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఆయనకు సంబంధించిన అనేక కేసులు సీబీఐ కోర్టులో విచారణలో ఉన్నాయి. వాటి కోసం ఆయన వారంలో ఎక్కడ ఉన్నా.. శుక్రవారం మాత్రం కోర్టు కు వచ్చేయాల్సి ఉంటుంది. అందుకే జగన్ కు శుక్రవారం కోర్టు వారంగా మారింది. రాజకీయంగా ఎంతో భవిష్యత్ ఉన్న జగన్ కు కేసుల భయం అంతా ఇంతా కాదు..

Image result for jagan cbi cases

ఏ ఒక్క కేసులోనైనా ఆయన దోషిగా తేలిందంటే ఇక ఆయన రాజకీయ భవిష్యత్తు దాదాపు ముగిసిపోయినట్టే అవుతుంది. అందుకే ఆయన కేసుల గురించి అమితంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటుతున్నాజగన్ పై ఒక్క కేసులోనూ నేరం రుజువు కాలేదు. అందుకు ఆయన కేంద్రంలో పెద్దలను మేనేజ్ చేస్తున్నారని టీడీపీ ప్రచారం చేస్తోంది. 

Image result for jagan cbi cases
ఈ సారి ఏకంగా సీఎం చంద్రబాబే అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ పై విమర్శలు చేశారు. జగన్ కు పెద్దలను గౌరవించే అలవాటు లేదని.. కానీ రాష్ట్రపతి వచ్చినప్పుడు మాత్రం పాదాభివందనం చేశారని చంద్రబాబు అంటున్నారు. అంతే కాదు.. బీజేపీ పెద్దలను అవసరం ఉన్నా లేకపోయినా కలుస్తూ.. ఆ ఫోటోలతో ప్రచారం చేసుకుంటున్నారని చంద్రబాబు అంటున్నారు. 



ఇదిగో పీఎం నాకు తెలుసు, రాష్ట్రపతి నాకు తెలుసు.. బీజేపీ పెద్దలకు నేను క్లోజు.. అని ప్రచారం చేసుకుని సీబీఐ తో సహా విచారణ వ్యవస్థల్లోని పెద్దలను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చంద్రబాబు అంటున్నారు. మరి సీబీఐని మేనేజ్ చేయడం ఇంత తేలికా.. ఇలా పీఎంతో, రాష్ట్రపతితో ఫోటోలు దిగితే ఇక సీబీఐ వారి జోలికి రాకుండా ఉంటుందా.. ఏమో దేశంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ చంద్రబాబుకే తెలియాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: