ఉత్తర్ ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.  ఒకదశలో ఆయన పార్టీ నేతలే కొన్ని సార్లు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. ఇక అధికారుల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు అధికారుల గుండెల్లో దడపుట్టించాయి.  ఇలా ఎప్పటికప్పుడు యోగి తనదైన మార్క్ చాటుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆ మద్య గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో యోగి ముఖ్య భూమిక పోషించారు. 
Image result for bjp
తాజాగా ఇప్పుడు యోగి ఛరిష్మా తగ్గిపోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల గోరఖ్‌పూర్, ఫూల్పూర్ నియోజకవర్గాల్లో జరిగిన లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. గోరఖ్‌పూర్ స్థానంలో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఇక్కడ బీజేపీ పరాజయం పొందగా.. సమాజ్‌వాదీ పార్టీ ఘనవిజయం సాధించింది.
Image result for yogi modi
ఇదిలా ఉంటే తాజాగా  ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 16 మంది జిల్లా కలెక్టర్లు సహా మొత్తం 37 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.  కాగా ఉప ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు రోజులు కూడా కాకముందే యోగి ప్రభుత్వం భారీ ఎత్తున ఉన్నతాధికారులకు స్థానచలనం కల్పించడం చర్చనీయాశంగా మారింది.

బదిలీ అయిన వారిలో గోరఖ్‌పూర్ కలెక్టర్ రాజీవ్ రౌతేలా కూడా ఉన్నారు. కాగా ఉప ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు రోజులు కూడా కాకముందే యోగి ప్రభుత్వం భారీ ఎత్తున ఉన్నతాధికారులకు స్థానచలనం కల్పించడం చర్చనీయాశంగా మారింది. బదిలీ అయిన వారిలో గోరఖ్‌పూర్ కలెక్టర్ రాజీవ్ రౌతేలా కూడా ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: