దక్షిణాది భారతదేశంలో ఏ రాష్ట్రం ఆదరించనంతగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని ఆదరించింది. ఈ క్రమంలో గత ఎన్నికలలో ఆ పార్టీని కొన్ని స్థానాలలో గెలిపించడం జరిగింది. ఈ నేపద్యంలో విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవలసిన బిజెపి నమ్మక ద్రోహం చేసి కేంద్రం నుండి రావలసిన హామీలను తుంగలో తొక్కింది. మరి అదే విధంగా తన మిత్రపక్ష పార్టీ తెలుగు దేశాన్ని కూడా మోసం చేసింది.


దీంతో భారతీయ జనతా పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అసహ్యం కలిగింది. ఇంత జరిగినా కానీ బీజేపీ పార్టీలో మార్పు రాలేదు. ఇప్పటికే వారు అదే బుకాయింపు మాటలను వల్లిస్తున్నారు. ప్రత్యేకహోదా వలన రాష్ట్రానికి ఎన్ని నిధులైతే వస్తాయో అంతకు పైసా కూడా తగ్గకుండా.. ఇవ్వాలన్న మాటకు మేం ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం అంటూ ఏపీలో పార్టీ అధ్యక్షుడు కంభం పాటి హరిబాబు చెబుతున్నారు.


శనివారం ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయిన హరిబాబు.. ఆ పిమ్మట.. మీడియాతో మాట్లాడుతూ.. పాతచింతకాయ పచ్చడి వాదనలనే వినిపించడం విశేషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదా అడుగుతుంటే బిజెపి మాత్రం రాష్ట్రానికి నిధుల ఇస్తాం అభివృద్ధి చేస్తామని సోది మాటలు మాట్లాడుతుంది.


ఈ క్రమంలో రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ అంటూ నాటకాలకు తెర లేపుతుంది. ముందు నుంచి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు మొత్తం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే బిజెపి మాత్రం ప్రత్యేక ప్యాకేజీ అంటూ పాత పాటే పాడుతుంది. తాజాగా ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షుడు కంభం పాటి హరిబాబు ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బిజెపి పార్టీ ని మరింతగా అసహ్యించుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: