వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమని వెల్లడైంది. ఏకంగా 12 ఏళ్లకు పైగా ఆయన అధికారంలో ఉంటారని వెల్లడైంది. జగన్ కూడా తన తండ్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి లాగా సుపరిపాలన అందిస్తారని పంచాంగకర్తలు స్పష్టం చేశారు.


          ప్రజా సంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న జగన్ మోహన్ రెడ్డి ఉగాంది సందర్భంగా బ్రేక్ ఇచ్చారు. ఇవాళ కాకుమానులో ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా పురోహితులు, పంచాంగకర్తలు జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించారు. పంచాంగశ్రవణం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం తథ్యమని పంచాంగకర్తలు ఆశీర్వదించారు.


          ఈసారి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. 135 సీట్లను వైసీపీ కైవసం చేసుకుంటుందని తెలిపారు. అంతేకాక.. 12 ఏళ్ల 8 నెలల 18 రోజులపాటు ఆయన అధికారంలో ఉంటారని జోస్యం చెప్పారు. అంతేకాక జగన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఈ ఏడాది అక్టోబర్ తో తొలగిపోతాయని తెలిపారు. ఆ తర్వాత ఆయనది రాజయోగమేనని వెల్లడించారు.


          ప్రస్తుతం జగన్ కు, రాష్ట్రానికి మంచి జరగాలనే కోరికతో సహస్ర చండీయాగం చేస్తున్నామని, రెండేళ్లపాటు అది నిరంతరాయంగా జరుగుతందని పురోహితులు వెల్లడించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక జగన్ పూర్ణాహుతికి హాజరవుతారని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: