Image result for kishan reddy photos
ప్రధాని నరెంద్ర మోడికి మాత్రమే కాదు నాటి నిండు రాజ్యసభలో సమైఖ్య ఆంధ్రప్రదేశ్ ను చీల్చేసిన నాటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్ కు కూడా "ప్రత్యేక వర్గ ప్రతిపత్తి రాష్ట్రం" (స్పెషల్ కాటగిరీ స్టేటస్ స్టేట్) అనే దానికి ఆంధ్ర ప్రదేశ్ కు అర్హత లేదు అనేది తెలిసి ఉండదు. కారణం అంత పరిశీలనా సమయం లేకుండా నాటి యుపిఏ అధినేత సోనియా గాంధి కలగజేసిన వత్తిడి గురై ఆ విభజన జరిగింది. లేకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర డిమాండ్లు "అత్యున్నత నిర్ణాయక సభ" ముందు పెట్టకుండా ఉంటారా!
Image result for ap reorganisation act 2014 telugu version pdf
తెలిసుంటే "ఐదేళ్ళెం ఖర్మ పదేళ్ళు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి" కావాలని నేతి దేశ ఉప రాష్ట్రపతి ముత్తవరపు వెంకయ్య నాయుడు గారు ఎలా అడిగి ఉండే వారు? "పదేళ్లు కాదు పదిహేనేళ్ళు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి"  కావాలని దేశంలోనే అత్యంత అనుభవశీలి నాలుగు దశాబ్ధాల సుదీర్గ రాజకీయ పాలనా అనుభవమున్న నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా అడిగి ఉండేవారు?
Image result for ap reorganisation act 2014 bill passed in Rajya sabha sonia gandhi
ఈ మొత్తం దగాకి కారణం రాష్ట్ర విభజనకు తొందరపెట్టి రాజ్యసభ తలుపులు మూసి రాజకీయ స్వార్ధం కోసం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు విభజన బిల్లు పాస్ చేయించిన ఘనురాలు సోనియా & కో మాత్రమే. రాష్ట్ర ఏర్పాటు బిల్లు తయారు చేసిన వారి బాధ్యత,  వారికి  దేశ సంరక్షణ ప్రజలపై అభిమానం అంత గొప్పగా ఉందన్న మాట. 
Image result for ap reorganisation act 2014 bill passed in Rajya sabha sonia gandhi
ఎన్నికల కురుక్షెత్రం నాటికి కూడా ఎవరూ ఈ విషయం పై పరిశీలన చేసి ఉండరు. అందుకే నరెంద్ర మోడీ తిరుపతి ఎన్నికల ప్రచార వేదికపై ఎవరో రాసి పంపిన చీటి చదివి ప్రత్యేక హోదాని పురుద్ఘాటించి ఉంటారు. అయితే బిల్ తయారీలో పాత్ర వహించిన అధికారుల నిర్లక్ష్యం క్షమార్హం కాదు. జర్నలిస్టులు ఎవరూ దీనిపై వ్యాఖ్యానించ లేదు. తమ రచనల్లో ప్రస్థావించిన వారిని లక్ష్య పెట్టలెదెవరూ. చంద్రబాబు వెంకయ్యనాయుడు ఈ విషయాలపై అవగాహన తరవాత వచ్చి ఉండవచ్చు. అందుకే ప్రత్యేక పాకేజికి సత్వరమే అంగీకరించి ఉంటారు. ఇప్పటికైనా నిజం చెప్పినందుకు బాజపా శాసనసభ పక్ష నేత కిషణ్ రెడ్డి ని అభినందించి తీరాలి.     
 Image result for ap reorganisation act 2014 bill passed in Rajya sabha sonia gandhi
అసలు విషయం చెప్పకుండా రాజకీయాలు చేసిన చంద్రబాబు కూడా నిర్లక్ష్యం వహించినట్లే. అయితే మొత్తం నాయకు లంతా క్షమార్హులు కానేకాదు. ఒకవేళ మాట యిచ్చి నందుకు ఏపికి ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తిని ఇస్తే దేశంలోని అన్నీ రాష్ట్రాలకు ఇవ్వల్సిన పరిస్థితులు నెలకొంటాయి. అందుకే కిరణ్ రెడ్డి దేశం లో అశాంతి అనిశ్చితి నెలకొంటుంది అనేది నూరు శాతం నిజం.


ఎడిటోరియల్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎండమావే!

మరింత సమాచారం తెలుసుకోండి: