రాష్ట్ర రాజకీయాలు రోజుకో  రంగుకు మారుతున్నాయి. ప్రత్యేకహోదా మీద అన్ని పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. అవిశ్వాసం పెడితే అయినా హోదాపై లోక్ సభలొ చర్చకు వస్తారురో అని అప్పటిలో వైసీపీ మొత్తుకున్నా, దానివల్ల ఏమి ఒరగదు అది మూర్ఖత్వం అని బాబు కొట్టిపడేశాడు. బాబు అవిశ్వాసానికి మాతో కలిసిరా అని జగన్ ఆహ్వానించినా స్పందించని బాబు జగన్ అవిశ్వాస తీర్మానం పెట్టిన తరువాత తాను కూడా పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.


బీజేపీతో పొత్తును విరమించుకొని అవిశ్వాసానికి తెరలేపియింది టీడీపీ. అవిశ్వాసం పెట్టిన వెంటనే బీజేపీ నేతలు కూడా తమ దూకుడుని పెంచారు. బీజేపీకి సంబంధించిన రాష్ట్ర కీలక నేతలను ఢిల్లీలో జరిగే పార్టీ మీటింగులో పాల్గొనవలసిందిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర నేతలను ఆజ్ఞాపించాడు.


నిన్న సాయంత్రం జరిగిన ఈ మీటింగుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు,ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, పురంధేశ్వరి వంటి తదితర కీలక నాయకులు పాల్గొన్నారు. ఈ మీటింగులో భాగంగా పొతుపై కూడా చర్చించినట్లు సమాచారం. టీడీపి తో ఎలాగూ విడిపోయారు కాబట్టి ఏపీ లో ఉన్న మరో బలమైన పార్టీ వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని భావించారట. దీని విషయమయే త్వరలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆంధ్రాకు వచ్చి జగన్ తో సమావేశమవబోతున్నారని ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు సమాచారాన్ని అందించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: