రాష్ట్రంలో రాజకీయాలు మరీ ఇంతలా వేడెక్కుతాయని, సమీకరణాలు సముద్రపు అలలలాగా మారుతాయని ఎవరూ ఊహించి ఉండరు. ప్రత్యేకహోదా విషయంపై రాజకీయపార్టీలు రంగులు మారుస్తూ ఉన్నాయి. జగన్ ఇప్పటికే కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాడు. అవిశ్వాస తీర్మానంతో ఏమీ ఒరగదు అని చెప్పిన బాబు కూడా ఇప్పుడు అవిశ్వాసాన్ని పెట్టడం బీజేపీ నాయకులకు ఒకింత షాక్ కు గురిచేసింది.


టీడీపీ పొత్తును విరమించిన నేపథ్యంలో బీజేపీ సైతం తన దూకుడును పెంచింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆంధ్ర నేతలతో అత్యవసరంగా శనివారం సాయంత్రం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు పై చర్చించారు. అయితే ఈ మీటింగులో పెద్దగా ప్రాధాన్యంలేని నిర్ణయాలు తీసుకోకపోయినా ఒక విషయంలో మాత్రం దీనికి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి కారణం వైసీపీ ఎన్నికల వ్యూహకర్త, జగన్ కు గుండె కాయలాంటివాడైన ప్రశాంత్ కిషోర్ హాజరవడం. ఆయన హాజరవడం గురించి ఎటువంటి సాక్షాలు  లేకపోయినా మీడియా మాత్రం ఆయన హాజరయినట్లు కోడై కూసింది.


కాగా మీడియాలో వచ్చిన వార్తలపై ప్రశాంత్ కిషోర్ సారధ్యంలో నడిచే ఐప్యాక్ సంస్థ స్పందించింది. ప్రశాంత్ కిషోర్ బీజేపీ మీటింగుకు హాజరయ్యాడని నిన్నటి నుండి వస్తున్న వార్తలను ఆ సంస్థ ఖండించింది. నిన్న శనివారం ప్రశాంత్ గారు అసలు ఢిల్లీలో లేరని తెలిపింది. ఢిల్లీలో లేని వ్యక్తి ఆ మీటింగుకు ఎలా వెళ్తాడని ప్రశించింది. ఇలాంటి అసత్య కథనాలు ప్రచురించవద్దని హితబోధ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: