ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంతో పోరాడతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. ఇందుకు రహదారులు దిగ్బంధనం చేస్తామని మంగళగిరి సభలోనే ప్రకటించారు. ఇప్పుడు దానికి సంబంధించిన కార్యాచరణ ప్లాన్ చేస్తున్నారు. దీనిపై కలసి వచ్చే ఇతర పార్టీలతోనూ చర్చలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తనపై బీజేపీ వ్యక్తిగా ముద్రపడటంతో దాన్నిచెరిపేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. 

Image result for pawan left
ఏపికి ప్రత్యేత హోదా సాధన డిమాండ్ తో నేడు విజయవాడ ఐవి ప్యాలెస్ లో జరిగే సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ హాజరవుతారు. 

Related image
ఈ సమావేశంలో ప్రత్యేక హోదా పోరాటంపై భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తారు. రెండు రోజుల క్రితం సిపిఐ, సిపిఎం నేతలతో భేటి సందర్భంగా పవన్ ను ఈ సమావేశానికి రావాలని ఆహ్వానించారు. గుంటూరు బహిరంగ సభ నుంచి పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై తన గళాన్ని గట్టిగా వినిపించినందున వామపక్షాలు ఆయనను కూడా సమావేశానికి రావాలని విజ్ఞప్తి చేశాయి. ఆయన అందుకు సమ్మతించారు. 

Image result for pawan left

ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా టీడీపీ, వైసీపీ కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన నేపథ్యంలో పార్లమెంటు పరిణామాలపై చర్చిస్తారు. కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏం చేయాలో నిర్ణయిస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: