నేటి రాజకీయ నాయకుల్లో అనేక మంది గత రాజ వంశాల పాలనా కాలం నాటి పాలకులకులతో పోల్చదగిన వారు అనేకమంది ఉన్నారు. తండ్రిని చంపి సింహాసనం అదిష్టించిన మొగల్ పాలకుల్లో గుర్తుంచుకోదగిన వాడు ఔరంగజేబు. అలాగే రాజకీయంగా వెన్నుపోటు పొడిచి మానసికంగా కృంగదీసి పిల్లనిచ్చిన మామను వంచించి ఆయన మరణానికి పరోక్ష కారకుడైన రాజకీయనాయకుడు మనవాడే మనందరకు బాగా తెలినవాడే. 

రాజకీయ కుహానా వ్యూహంతో సోనియా గాంధి నిండు రాష్ట్రాన్ని కౄరంగా విభజించి విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు  ప్రత్యేకించిన ప్రయోజనాలను పొందు పరచకుండా తెలుగువారి హృదయవేదనను పట్టించుకోకుండా ధారుణంగా గాయపరచారు.
Image result for jayapradha in recent news comments on sp mp ajam khan
అయితే ప్రయోజనం ఏదైతే ఆశించి దాన్ని పొంది, అధికారంలోకి వచ్చీ రాగానే, సోనియాకు కాంగ్రేస్ కు ఇచ్చిన మాట వదిలేసి సింహాసనం ఎక్కి కూర్చున్న మరో మోసగాడూ మనవాడే. 

అయితే ఇదంతా రాజకీయం అంటారు.ఇక్కడ ఇది సహజం. అని రాజకీయ నాయకులు ఊర్కుంటారా? వారికి ఇబ్బందులు కలిగితే మాత్రం వేరే వారిని రాజకీయం చేశారనటం మోసం చేశారనటం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిదే మరో నట రాజకీయ రమణి తెలుగు వారి అందాల కథానాయకి  జయప్రధ కథ. 
Image result for jayapradha in recent news comments on sp mp ajam khan
ఈ మద్య చాలా వివాదాల నేపధ్యంలో నలిగి ప్రఖ్యాతి పొంది వాటితోనే ప్రచారం పొందిన బాలీవుడ్ సినిమా  "ప‌ద్మావ‌త్" సినిమా ఎంత పెద్ద హిట్ట‌యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆ సినిమాలో రాణి ప‌ద్మావ‌తి పాత్ర క‌న్నా అల్లాఉద్ధీన్ ఖిల్జీ పాత్ర‌కే ఎక్కువ ప్రాధాన్యం ద‌క్కింది. ప‌ద్మావ‌తి సోయగం, అందం గురించి పలు మార్లు క‌థ‌లు క‌థ‌లుగా విన్న క్రూరుడైన రారాజు అల్లాఉద్ధీన్ ఖిల్జీ ఆమెపై వ్యామోహం పెంచుకున్న కథ అది. 

"ఆమెని ఎలాగైనా ఒక్క సారైనా చూడాల‌ని చిత్తోడ్‌ ఘడ్ పై పలుమార్లు దండ‌యాత్ర చేస్తాడు. దాదాపుగా నా జీవితంలో కూడా ఒక అల్లాఉద్ధీన్ ఖిల్జీ ఉన్నాడు" అని ఒక‌ప్ప‌టి ప్రఖ్యాత గ్లామ‌ర్ క్వీన్ జ‌య‌ప్ర‌ద తాజాగా కామెంట్ చేశారు. ప‌ద్మావతిని వేదించిన‌ట్లు త‌నని కూడా ఒక అల్లాఉద్ధీన్ ఖిల్జీ రాజకీయంగా వెంటాడి వేధించాడ‌ని ఆయనే మాజీ పార్లమెంట్ సభ్యుడని చెప్పుకొచ్చారు. 2009 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తన సొంత "సమాజ్ వాదీకి పార్టీ"  చెందిన ఆజమ్ ఖాన్ తనను ధారుణంగా వేధించారని ఆమె అన్నారు   Image result for jayapradha in recent news comments on sp mp ajam khan
"పద్మావత్ సినిమా లో అల్లావుద్దీన్ ఖిల్జీని చూస్తున్నప్పుడు నాకు ఆజమ్ ఖాన్ గుర్తొచ్చారు. 2009 రాంపూర్ ఎన్నికల్లో నన్ను అప్రతిష్ట పాల్జేయడానికి అజాం ఖాన్ ఎన్నో ఎత్తులు వేశారు. ఒక విధంగా చెప్పాలంటే నన్ను వేధింపులకు గురిచేశారు. అయినప్పటికీ అప్పుడు నేనే గెలిచాను." జయప్రద చెబుతున్న మాట. 

ఈ రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు వివాదాల సంగతి పక్కనపెడితే జయప్రద వ్యాఖ్యలపై ట్విట్టర్ లో కామెడీగా ట్వీట్లు పడుతున్నాయి. 55 ఏళ్ల జ‌య‌ప్ర‌ద త‌న‌ని దీపిక ప‌దుకొనే తో కంపేర్ చేసుకుంటుందా? అని స‌ర‌దాగా ట్రాలింగ్ మొద‌లైంది.
Image result for jayapradha in recent news comments on sp mp ajam khan
అసలు రాజకీయ నాయకులు ముఖ్యంగా సినీ రంగం నుండి రాజకీయాల్లోకి వెళ్ళినవారు చెప్పుకోవటమే తప్పు. ఎందుకంటే సినీ రంగమే ఒక రొచ్చు అంటారు. అంత కంటే రెండాకులెక్కువ రాజకీయరంగం. దీన్నిబట్టి చూస్తే  జయప్రద పని "పెనంలో నుంచి పొయ్యి" లో పడ్దట్టుందని అర్ధమౌతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: