అవిశ్వాస తీర్మానంతో హీటెక్కుతుందని అనుకున్న లోక్ సభ అనూహ్యంగా వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా కేంద్ర సర్కారుపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ముందుకు రావాల్సిఉండగా.. పార్లమెంట్‌  వాయిదాపడింది. సోమవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభమైంది. అప్పటికే కొన్ని స్పీకర్‌ వెల్‌లోకి వచ్చిన కొన్ని విపక్షాలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయసాగాయి. 

వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ ఇచ్చిన అవిశ్వాసం తీర్మానం నోటీస్ పై నిర్ణయాన్ని వాయిదా వేశారు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్. సభలో గందరగోళం నెలకొనటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నోటీస్ పై చర్చకు ఏపీ ఎంపీలు డిమాండ్ చేశారు. కాగా, లోక్ సభ నియమావళిలోని 17 అధ్యాయం 198(B) మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీ అందింది.  సభ అదుపులోకి వస్తే దానిపై చర్చ చేపడతాను అని స్పీకర్ ప్రకటించారు.
Lok Sabha Adjourned After 30 Seconds Of Start - Sakshi
లోక్ సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి వివిధ అంశాలపై సభలో నిరసనలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకించి తెలుగు ఎంపీలు నిలబడి నిరసనలు తెలపడం, స్పీకర్ వెల్ వద్దకు వచ్చి నినాదాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో.. అలాంటి పరిస్థితి లేకుంటేనే.. సభలో అవిశ్వాసం అంశం చర్చకు వస్తుందని.. స్పీకర్ స్పష్టం చేసినట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: