వాయిదాలు కొనసాగుతుండగా అవిశ్వాసంపై చర్చ ఎలా జరుగుతుందనే సందేహం రావడం సహజం. ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయం హస్తినలో హల్ చల్ చేస్తున్నవేళ మోదీ ప్రభుత్వంపై అటు వైసీపీ, ఇటు టీడీపీ అవిశ్వాస తీర్మానాలిచ్చాయి. అయితే లోక్ సభ ప్రతిరోజూ వాయిదా పడుతూనే వస్తోంది. ఈరోజు కూడా వాయిదా పడింది.

Image result for parliament

          ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అధికార ప్రతిపక్షాలు రెండూ డిమాండ్ చేస్తున్నాయి. మొన్నటివరకూ ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదం తెలిపిన టీడీపీ., ఇప్పుడు హోదా కోసం పట్టుబడుతోంది. నాలుగేళ్లపాటు బీజేపీతో కలిసున్నా.., రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం కలగలేదని ఆరోపిస్తోంది. ఇప్పటికీ విభజనచట్టంలోని హామీలను నెరవేర్చలేదని, విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి బీజేపీ కాసింతైనా న్యాయం చేయలేదని చెప్తోంది. అదే కారణంతో కేంద్రంలోని ఇద్దరు మంత్రులను తప్పించింది.

Image result for parliament

          ఇక వైసీపీ మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉంది. ప్రత్యేక హోదాను వదిలేసి ప్రత్యేక ప్యాకేజీకి మొగ్గు చూపి చంద్రబాబు తప్పు చేశారని ఆరోపిస్తోంది. నాలుగేళ్లపాటు కిమ్నకుండా కూర్చొని ఇప్పుడు మళ్లీ ప్రత్యేక హోదా గళమెత్తడం చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు నిదర్సనమనేది వైసీపీ వాదన. ఏదైతేనేం.. ఇప్పుడు రెండు పార్టీలూ మోదీ సర్కార్ పై కన్నెర్ర చేశాయి. అవిశ్వాస తీర్మానాలిచ్చాయి. వీటిపై చర్చకోసం పట్టుబడుతున్నాయి.

Image result for parliament

          అవిశ్వాస తీర్మానాలు సభ ముందుకు వస్తున్నా, సభలో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మొన్న, ఈరోజు కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. సభ ముందుకు అవిశ్వాస తీర్మానాలు వచ్చాయని, సభ ప్రశాంతంగా ఉంటే చర్చకు చేపడతానని స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారు. అయితే సభలో మాత్రం అలాంటి ప్రశాంత పరిస్థితి కనిపించడం లేదు. అయితే వాస్తవానికి ఇవాళ సభ నిరవధికంగా వాయిదా పడుతుందని అందరూ భావించారు. అయితే సభను నిరవధికంగా వాయిదా వేయలేదు. మంగళవారానికి వాయిదా వేశారు. దీన్ని బట్టి అవిశ్వాసంపై చర్చించేందుకే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు అర్థమవుతోంది. రేపైనా సభ ప్రశాంతంగా ఉంటే చర్చకు వచ్చే అవకాశం ఉంది. రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే అప్పుడు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: