తొలి నుండీ ఏపి విభజన చట్టంలో పొందుపరచిన ప్రయోజనాల్లో ప్రతి ఒక్కటీ నెరవేర్చాలని, ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో రాజీ లేని పోరాటం  చేస్తోంది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి. ఈ విషయంలో ఏపి ప్రజలకు ఎలాంటి అనుమానం లేదు. అసలు ప్రత్యేక హోదా అంశంపై క్షణ క్షణం స్వరం మారుస్తూనే ఉండి చంద్రబాబు నాయకత్వంలోని టిడిపి. ప్రత్యేక హోదా కోసం వీధుల్లోకి వచ్చి పోరాడితే విధ్యార్ధులను అరష్టు చేస్తామని, చివరకు వారి తల్లిదండ్రులను కూడా ఇదే విషయమై హెచ్చరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

Image result for no confidence motion by TDP & YCP

 శాసనసభ సాక్షిగా ప్రత్యేక హోదా సంజీవని కాదని ప్రత్యేక పాకేజీయే సర్వస్వమని చెపుతున్నా తను నమ్మిన సిద్ధాంతాన్ని పట్టుకొని పట్టువదలని విక్రమార్కునిలా పోరాడుతున్నారు వైసిపి అధినేత. రాష్ట్రమంతా సంకల్ప పాద యాత్ర చేస్తూ ప్రజల్లో ప్రత్యేక హోదాని బ్రతికిస్తూవచ్చారు ఇప్పటివరకు. కేంద్రంలోని బాజపా ప్రభుత్వం పై అవిశ్వాసం  పెట్టటానికి కూడా నిశ్చయించు కుని కొద్దిమంది తన ఎంపిలను దానికి సమాయత్త పరచింది వైసిపి.

Image result for no confidence motion by TDP & YCP

అయితే అధికారపక్షం తన ఎమ్మెల్యెలని కొనేసి సర్వాధికారాలను లాక్కొని రాష్ట్రంలో ప్రతిపక్ష అవసరం లేదని అంటున్న సమయంలో కూడా తను నమ్మిన ఈ ప్రత్యేక హోదా సంపాదించటం తన రాజకీయ మనుగడకు చాలా అవసరమని నమ్మి దానికి ఉద్యమ రూపం తెచ్చిన జగన్ ప్రయత్నాన్ని, ఇప్పుడు ప్రజలలోని భావోద్వేగాలకు చెదిరిపోయి, కొట్టుమిట్టాడు తున్న టిడిపి ఇప్పుడు, ప్రత్యేక హోదాని ఉద్యమాన్ని తన ఖాతాలోకి మార్చుకోవటానికి హైజాక్ డ్రామా ఆదుతుంది.


తొలినుంచి అవిశ్వాసం ప్రతిపాదించడం గురించి,  చాలా గట్టిగా పట్టుగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ఇప్పటికీ అదే ధోరణిని కనబరుస్తూ ఉండగా, అదే సమయంలో తెలుగుదేశం పార్టీ, ముందు వైసిపి కి అవిశ్వాసం విషయంలో మద్దతు నిస్తానని ప్రకటనలు శాసనసభ సాక్షిగా చేసి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి తానే అవిశ్వాసాన్ని స్వంతంగా ప్రవేశ పేడతాననటం ప్రజాబాహుళ్యాన్ని ఆశ్చర్య చకితుల్నేకాదు అనుమానాస్పదుల్ని చేసింది టిడిపి నాయకత్వం.

Image result for no confidence motion by TDP & YCP

కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే విషయంలో, దానికి మద్దతు రాబట్టే విషయంలో, మద్దతు ఇచ్చే విషయంలో  రాష్ట్రంలోని రెండు పార్టీలూ రెండు రకాలుగా వ్యవహరిస్తున్నాయి కూడా.  

Image result for no confidence motion by TDP & YCP

చివరకు రెండు పార్టీలు రెండుమార్గాల్లో నడవవలసిన అగత్యం టిడిపి వైసిపికి కల్పించింది. టిడిపి తొలుత అవిశ్వాస తీర్మానం చేస్తే కూడా తాము మద్దతు ఇస్తామని తమకు ప్రత్యేక హోదా తప్ప మిగిలిన రాజకీయాలు ప్రామాణికం కాదని వైసిపి చెపుతూనే వస్తుంది. అవిశ్వాస తీర్మానానికి కట్టుబడి ఉన్న జగన్మోహన్ రెడ్డి, తాము ప్రతి పాదించే తీర్మానానికి తెలుగుదేశం పార్టీ అయినా మద్దతివ్వాలని కోరుతూ, ఒకవేళ తెలుగుదేశం తీర్మానం ప్రతిపాదించినా తాము మద్దతిస్తాం అంటూ జగన్ చాలా ప్రకటించారు.

Image result for no confidence motion by TDP & YCP

అయితే తొలుత తాము మద్దతిస్తాం అని ప్రకటించిన చంద్రబాబు, ఆ తర్వాత మడత పేచీ పెట్టారు. తీర్మానం తామే పెడతాం అని ప్రకటించారు. ఏదైతే ఏమైంది. వైకాపా వారికి కూడా మద్దతుగానే నిలిచింది. ఒకసారి ప్రతిపాదించిన తీర్మానాలు వీగిపోయాయి. రెండోసారి మళ్లీ రెండుపార్టీలూ ప్రతిపాదించిన అవిశ్వాసం ఈరోజు అంటే సోమవారం చర్చకు మొదయ్యే పరిస్థితుల్లో సభలు సజావుగా సాగక వాయిదాలు పడుతున్నాయి 

 Image result for no confidence motion by TDP & YCP

అయితే తమ రెండు పార్టీల తీర్మానాల్లో తెదేపా తీర్మానాన్ని స్పీకరు చర్చకు స్వీకరించినా కూడా, తాము మాత్రం స్పష్టంగా మద్దతు ఇస్తాం అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రకటించింది. వారు చెప్పినంత స్పష్టతగా తెలుగుదేశం చెప్పలేకపోతున్నదన్నంది నిజం. ఇది చూస్తుంటే టిడిపి అవిశ్వాసంలో కూడా ఏదో కుట్ర కోణం తొంగి చూస్తు న్నట్లనిపిస్తుంది.

అవిశ్వాసం విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ తమరాజకీయ ప్రయోజనాన్ని ఫణంగా పెట్టి కూడా తీర్మానం చర్చకువస్తే అదే పదివేలనే ధోరణిని ప్రదర్శిస్తోంది. ప్రజాపక్షం  వహిస్తుంది. అదే సమయంలో, తెలుగుదేశం మాత్రం వైసిపి అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చినా మద్దతివ్వడానికి సిద్ధం అనే వాగ్ధానం చేయలేకపోవటానికి కారణం గురించి పలువురు ప్రశ్నిస్తున్నారు.

Image result for no confidence motion by TDP & YCP

టిడిపి విపక్షాల పోరాటానికి మామూలుగా సహకరించినా రాష్ట్రానికి "ప్రత్యేక హోదా" పై సరైన నిర్ణయం జరిగి ఉండేదని వాదన బలంగా వినిపిస్తోంది.  దీన్నిబట్టీ, వైసిపి నిర్మించి, ప్రజల్లో బ్రతికించిన భావావేశాన్ని ప్రత్యేక హోదా పోరాటాన్ని తెలుగుదేశం పార్టీ దాని అధినేత హైజాక్ చేయటానికి ప్రయత్నించటం కనిపిస్తూనేఉంది.

పెద్దలన్నట్లు చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైన యట్లు....అనే సుమతీ శతకకారుని వాక్కుని టిడిపి నిజం చేస్తుంది కడా!

 Image result for cheemalu pettina puttalu padyam

మరింత సమాచారం తెలుసుకోండి: