రాష్ట్రంలో మైండ్ గేమ్ నడుస్తోంది. అన్ని పార్టీలూ ప్రత్యేక హోదా కోసమే పోరాడుతున్నాయన్నట్టు చెప్తున్నాయి. కానీ అవన్నీ కలిసి పోరాడడానికి మాత్రం ముందుకు రావట్లేదు. దీన్నిబట్టి రాష్ట్ర ప్రయోజనాలకంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని క్లియర్ గా అర్థమవుతోంది. రాజకీయ పార్టీలకు రాజకీయాలే ముఖ్యం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఏ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది..?

Image result for YCP AND TDP

          ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తికావస్తోంది. కేంద్రంలో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చింది. రాష్ట్రానికి అంతోఇంతో మేలు జరుగుతుందని భావించి పొత్తు పెట్టుకున్నామని టీడీపీ చెప్పుకుంటూ వచ్చింది. అయితే నాలుగేళ్లవుతున్నా కూడా విభజన చట్టంలోని హామీలు నెరవేరకపోవడం, ప్రత్యేక ప్యాకేజీ కింద ఇస్తామన్న నిధులు ఇవ్వకపోవడంతో తాము కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. అంతేకాక వైసీపీ బాటలో తాము కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది.

Image result for YCP AND TDP

          వైసీపీ మొదటి నుంచి ప్రత్యేక హోదానే డిమాండ్ చేస్తోంది. నాడు ప్రత్యేక హోదా ప్లేస్ లో ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు సర్కార్ అంగీకరించినప్పుడే వైసీపీ తప్పుబట్టింది. హోదా మాత్రమే రాష్ట్రానికి మేలు చేస్తుందని, అది కాకుండా ఇంకేదానికి ఆమోదం తెలిపినా ఉపయోగం ఉండదని వైసీపీ అధినేత జగన్ పలుమార్లు హెచ్చరిస్తూ వచ్చారు. చివరకు హోదాను కాదని ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు.. మళ్లీ హోదా కోసం ఉద్యమించడమే ఇప్పుడు విడ్డూరం..

Image result for YSRCP

          వైసీపీ డిమాండ్ ను మొదటి నుంచి తప్పుబడుతూ వచ్చిన అధికార టీడీపీ.. ఇప్పుడు ప్రతిపక్షం బాటనే ఎంచుకుంది. ప్రతిపక్ష ప్రత్యేక హోదా డిమాండ్ ను హైజాక్ చేసి తానే మొదటి నుంచి ఉద్యమిస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తోంది. అంతేకాక, కేంద్రంలో వైసీపీకి ఎవరూ మద్దతివ్వడం లేదని, టీడీపీ అవిశ్వాసం అనగానే పలు పార్టీలు ముందుకొచ్చాయని.. అదీ టీడీపీ విశ్వసనీయత అని ఆ పార్టీ అధినేత చెప్పుకొస్తున్నారు. అయితే మొదటి నుంచి ప్రత్యేక హోదా డిమాండ్ ను ఎవరు అడుగుతున్నారు, ఇప్పుడు ఎవరు హైజాక్ చేశారనే విషయం అందరికీ తెలుసు. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇవ్వాలో వాళ్లే నిర్ణయించుకుంటారు.!


మరింత సమాచారం తెలుసుకోండి: