పదవతరగతి పరీక్షలంటే..విద్యార్థులకు ఎంత టెన్షన్ ఉంటుందో అందరికీ తెలుసు.  అయితే కొంత మంది దళారులు ఇలాంటి వారి వీక్ నెస్ క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.  మరీ దారుణమైన విషయం ఏంటంటే..విద్యాశాఖకు తూట్లు పొడుస్తూ..పేపర్ లీక్ చేసి అప్పలంగా డబ్బు సంపాదించాలని చూస్తుంటారు. కానీ అలాంటి వారి పాపం ఇట్టే బయటపడటంతో ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి నెలకొంటుంది.

తాజాగా ఆదిలాబాద్, వనపర్తి జిల్లాల్లో పరీక్షకు ముందే బయటకు వచ్చిన ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం. క్వశ్చన్ పేపర్ లీకేజీతో అప్రమత్తమైన పాఠశాల విద్యాశాఖ. రెండు జిల్లాల కలెక్టర్లు, డీఈఓలతో మాట్లాడిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్. 

లీకైన సెంటర్ల సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్లు, విద్యార్థుల పై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశం. ఈ ఉదయం పరీక్షకు ముందే లీకైన పేపర్. ఓ టీచర్ సెల్ ఫోన్ తో ఫోటో తీసి సర్క్యూలేట్ చేసినట్లు అనుమానాలు. మరింత సమాచారం అందాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: