రెండు గంటల పాటు సీఎం మమతా బెనర్జీతో భేటీ అయిన సీఎం కేసీఆర్.  సీఎం కేసీఆర్ తో పాటు ఎంపీ కవిత, 8 మంది ఎమ్యెలు హాజరయ్యారు. శ్చిమ బెంగాల్‌ సచివాలయంలో ఈ భేటీ జరుగుతోంది. ఈ సందర్భంగా సచివాలయం చేరుకున్న కేసీఆర్‌కు మమతా బెనర్జీ స్వాగతం పలికారు. మమతాతో కేసీఆర్‌ దాదాపు రెండు గంటలపాటు సమావేశమై కొత్త కూటమి ఏర్పాటు సన్నాహాలపై చర్చించనున్నారు.
Telangana CM KCR Meets Mamata Banerjee In Kolkata - Sakshi
కాగా దేశంలో కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కొత్త కూటమి ఏర్పాటును ప్రతిపాదిస్తూ కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ దిశగా కార్యాచరణలో భాగంగా ఆయన ఇవాళ మమతతో సమావేశం అయ్యారు.  దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యమని ప్రకటించిన కేసీఆర్‌‌ జాతీయ రాజకీయాలు, ఫ్రంట్‌ ఏర్పాటుపై మమతా బెనర్జీతో చర్చిస్తున్నారు. నాన్‌ బీజేపీ, నాన్‌ కాంగ్రెస్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు సహకరించాలని కోరనున్నారు. బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా టీడీపీ, వైసీపీలు కేంద్రంపై అవిశ్వాస యుద్ధం చేస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ కొత్త ఫ్రంట్‌ ఏర్పాటుకు మద్దతు కూడగట్టే పనిలో బిజీగా ఉన్నారు.
kcr
బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా ఫ్రంట్‌‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ దేశవ్యాప్త టూర్‌‌కి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ముందుగా బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. అంతకు ముందు కేసీఆర్‌కు నేతాజీ విమానాశ్రయంలో మంత్రి పూర్ణేంద్ర ఘన స్వాగతం పలికారు.

మమతతో సమావేశం అనంతరం కేసీఆర్‌ కాళీ ఘాట్‌లోని కాళికామాత ఆలయాన్ని దర్శించుకుంటారు. రాత్రి 7.30కు అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. ఇక కేసీఆర్‌ వెంట ఎంపీ వినోద్‌ కుమార్‌, కవిత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, పలువురు పార్టీ ముఖ్యనేతలు కూడా కోల్‌కతా వెళ్లారు.


మరింత సమాచారం తెలుసుకోండి: