Image result for kcr mamata meet

ఫెడరల్ ఫ్రంట్

దేశ రాజకీయాల్లో బాజపా వేగం క్రమంగా సన్నగిల్లుతుండటం తో కొత్త రాజకీయ కూటమి ఏర్పాటు దిశగా చొరవ తీసుకుంటా నని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అందుకు అనుగుణంగా ముందడుగు అడుగు వేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. పశ్చిమ బెంగాల్ సచివాలయంలో కేసీఆర్‌కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ సాదర స్వాగతం పలికారు. 

Image result for kcr mamata meet

కేసీఆర్‌ తో పాటు తెలంగాణా రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు, ఎంపీలు జితేందర్‌రెడ్డి, కవిత, ప్రస్తుత రాజ్యసభ అభ్యర్థి సంతోష్ కుమార్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం ప్రత్యేక కార్యదర్శి నర్సింగ్ రావు తదితరులు ఉన్నారు. ఈ సమావేశం లో ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ, ఎజెండా, ఇతర విషయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. భేటీ తర్వాత తదుపరి సమావేశం, కార్యాచరణపై ప్రకటన చేసే అవకాశాలున్నాయి.


ఇరువురు నేతలూ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో తొలుత కేసీఆర్‌ మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ఆవశ్యకతపై చర్చించామని స్పష్టంచేశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో భాజపా, కాంగ్రెస్‌ విఫల మయ్యాయన్నారు. తమ ఫ్రంట్‌ చాలా పెద్దదని, ప్రజల ఎజెండాతో త్వరలోనే తమ కూటమి ముందుకొస్తుందన్నారు. 

Image result for kcr mamata meet
దాదాపుగా రెండు గంటలకు పైగా దేశ రాజకీయాల్లో వస్తున్న మార్పులు, దానికి తగిన స్పందన తదితర అంశాలపై చర్చలు జరపనున్నారు. ముఖ్యన్ గా కాంగ్రెస్ బజపా యేతర పార్టీల కలయిక పై చర్చలు జరిగినట్లు తెలుస్తుంది.  భేటీ అనంతరం సీఎం కేసీఆర్, కాళీమాత ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోనున్నారు.

Image result for akhilesh maya tejaswi

సెక్యులర్ ఫ్రంట్ 

ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ కలిసి పనిచేస్తే తిరుగుండదని తాజా ఉప ఎన్నికలు నిరూపించాయి. బాబ్రీ మసీదు విధ్వంసానంతరం 1993లో ఎస్పీ, బీఎస్పీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. అతి పెద్దపార్టీగా అవతరించిన బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోగలిగాయు. తాజా ఉపఎన్నికల్లో ఇదే చరిత్ర పునరావృతం అయ్యింది. బీసీ, దళిత్‌, ముస్లిం ఓట్లు కలిస్తే తిరుగులేదని 2015 బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీ(యు), కాంగ్రెస్‌ నిరూపించాయి. 


తాజాగా యూపీలో ఎస్పీ-బీఎస్పీ ఇదే సూత్రాన్ని పాటించి విజయం సాధించాయి. 2019 ఎన్నికల్లోనూ రెండూ కలిసి పనిచేస్తే యూపీలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచు కుని, కేంద్రంలో ప్రత్యామ్నాయ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని అంటున్నారు.
Image result for akhilesh maya tejaswi
యూపీ ఉపఎన్నికల ఫలితాలు భావిరాజకీయాలకు సంబంధించి సంకేతాలుగా భావిస్తున్నారు. కాంగ్రెస్‌ మూడు లోక్‌సభస్థానాల్లో విడిగా పోటీచేసి డిపాజిట్లు కోల్పోయింది ప్రత్యామ్నాయ కూటమి ప్రయత్నాల్లో బేరమాడే శక్తిని కోల్పోయింది. తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కొత్తగా ఏర్పాటయ్యే లౌకిక ఫ్రంట్‌కు ఎస్పీ, బీఎస్పీ లు నేతృత్వం వహిస్తాయని అంచనా వేస్తున్నారు. 

ఎన్‌డీఏ కూటమి నుంచి వెళ్లిపోయిన, దూరంగా ఉంటున్న పార్టీల్లో కొన్ని కొత్తగా ఏర్పాటయ్యే లౌకిక ఫ్రంట్‌లో భాగస్వాములయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే 2019 లోక్‌సభ ఎన్నికల కల్లా రాజకీయాలు కొత్తరూపు సంతరించుకుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: