ఎన్నికల వేళ బీజేపీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా షాక్ ఇచ్చారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. కర్ణాటక రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్న లింగాయత్ లను ప్రత్యేక మతంగా గుర్తిస్తూ ఆ వర్గంను ప్రసన్నం చేసుకుంది కాంగ్రెస్. లింగాయత్ లను ప్రత్యేకమతంగా చూడాలనే డిమాండ్ కు పచ్చజెండా ఊపిన కేబినెట్.. కేంద్రానికి సిఫారసు చేసింది.

Image result for karnataka and lingayat

లింగాయత్ లను ప్రత్యేక మతంగా గుర్తించాలనే డిమాండ్ పై గతంలో అనేక ఉద్యమాలు, నిరసనలు జరిగాయి. దీంతో ప్రభుత్వం లింగాయత్ ల డిమాండ్ల సాధ్యాసాధ్యాలపై నాగమోహన్ దాస్ కమిటీ  ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సులను ఆమోదించిన కర్ణాటక మంత్రివర్గం.. లింగాయత్ లను ప్రత్యేక మతంగా గుర్తించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని వెల్లడించింది. దీంతో బంతి మోదీ కోర్టులో పడింది. లింగాయత్ లు తమకు  ప్రత్యేక మతం లేదా.. మైనార్టీ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తాము హిందువులం కాదని, హిందూ మతంలో కులాలుంటాయని, తమ మతంలో కులాలు ఉండవని వాదిస్తున్న లింగాయత్ ల డిమాండ్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో కర్ణాటకలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి.

Image result for karnataka and lingayat

కర్నాటక జనాభాలో 18శాతం ఉన్న లింగాయత్ లు ఇక్కడ రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్నారు. మాజీ సీఎం యడ్యురప్ప కూడా లింగాయత్ వర్గానికే చెందిన వారు కావడంతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వారి డిమాండ్ లకు  ఓకే చెప్పడంతో బీజేపీలో కలవరం మొదలైంది. ప్రభుత్వంపై వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకుని ఈసారి అధికారాన్ని చేపట్టాలని యోచిస్తున్న యడ్యూరప్పకు షాక్ ఇచ్చిన సిద్ధరామయ్య.. ఇటు బీజేపీని, అటు సిద్ధరామయ్యను ఒకేసారి ఇరుకున పడేశారు.     కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై ఆచితూచి స్పందిస్తోన్న బీజేపీ..దీన్నో ఎన్నికల స్టంట్ గా కొట్టిపారేస్తోంది. కాంగ్రెస్ దేశంలోని హిందువులను విడగొట్టే ప్రయత్నం చేస్తోందంటూ బీజేపీ కౌంటర్ వేస్తోంది.

Image result for karnataka and lingayat

హిందూ మతాన్ని కులవాదం నుంచి తప్పించి సంస్కరించడానికి  వచ్చిన 12వ శతాబ్ధపు సంఘ సంస్కర్త బసవేశ్వరుని వారసులనే లింగాయత్ లుగా పిలుస్తారు. బసవేశ్వరుడు బ్రాహ్మణుడే  అయినా.. కులవ్యవస్థను నిర్మూలించేందుకు బ్రహ్మణ కుల సాంప్రదాయాలనే వ్యతిరేకించారు. హిందూ జాతిని  కులం లేని మతంగా తీర్చిదిద్దే క్రమంలో లింగాయత్ వ్యవస్థను స్థాపించారు. ఇప్పుడు ఆ లింగాయత్ లకే కర్ణాటక రాజకీయాలను శాసిస్తుండడంతో వారిని ప్రసన్నం చేసుకోవడంలో సక్సెస్ సాధించిన సిద్ధరామయ్య.. రాజకీయ వ్యూహంలో ముందున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: