పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బిజెపి పార్టీకి రహస్య ఒప్పందం కుదిరింది అని ఆరోపణలు చేస్తున్నారు. అధికార పార్టీ తెలుగుదేశం నాయకులు. ఈ విషయం జనసేన పార్టీ నియమాలను గమనిస్తే అవుననే సమాధానమే వస్తుంది. తాజాగా ఇటీవల  జనసేన పార్టీ తరపున వాయిస్ వినిపించేందుకు పార్టీలో కొంతమందిని ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీ నుండి వచ్చిన వారికి  ప్రాధాన్యత ఇచ్చరు.


ఎప్పటినుండో జనసేన పార్టీ తరఫున అనేక టీ.వీ చానల్ చర్చలో అద్భుతంగా మాట్లాడిన జనసేన నాయకుడు దిలీప్ ని పక్కనపెట్టి, బిజెపి పార్టీకి గుడ్ బై చెప్పి...ఈ మధ్య జనసేన లోకి వచ్చిన అద్దేపల్లి శ్రీధర్‌‌ను ఎంపిక చేయడం అందరిని  ఆశ్చర్యపరిచింది. అయితే ఈ క్రమంలో ఇదే విషయంపై కత్తి మహేశ్ ట్విట్టర్ వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “అంటే అన్నాం అంటారు గానీ! కొత్తగా ఎవరూ లేనట్టు మాజీ బీజేపీ నాయకుడు అద్దేపల్లి శ్రీధర్ ను జనసేన స్పోక్స్ పర్సన్ చెయ్యడమేమిటి!


ఇన్నాళ్లూ గొంతెత్తి జనసేన గళం వినిపిస్తున్న యువనాయకుడు కళ్యాణ్ దిలీప్ సుంకర లాంటివాళ్లకు అన్యాయం కదా!?!” అని కత్తి ట్వీట్ చేశారు. గతంలో కత్తి మహేష్ పవన్ మీద ఏ కామెంట్ పెట్టిన ఇంతెత్తున లేచి ఆయన అభిమానులు ఇప్పుడు మాత్రం సైలెంట్ అవడం గమనార్హం.


అలాగే కత్తి ట్వీట్‌‌కు చాలా వరకు పాజిటివ్‌‌గానే రిప్లైలు వస్తున్నాయి. అంతేకాకుండా తాజాగా ఓ జాతీయ ప్రముఖ మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా పెద్దగా అవసరం లేదు అన్నా టైపులో పవన్ చేసిన వ్యాఖ్యలు బట్టి కూడా తెలుస్తుంది….పవన్ కళ్యాణ్ బిజెపితో లాలూచీ పడ్డారని అని అంటున్నారు అధికార పార్టీ నాయకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: