వైసిపి అధినేత ప్రతిపక్ష నేత జగన్ రాబోయే ఎన్నికలలో గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో  ప్రజలు పడుతున్న సమస్యలు తెలుసుకోవాలని ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టారు. అంతేకాకుండా నియోజకవర్గాల వారీగా రాబోయే ఎన్నికల్లో పార్టీ తరఫున నిలబడే అభ్యర్థులను ఖరారు చేయడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా జగన్ గోదావరి జిల్లాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. గత ఎన్నికలలో రెండు  గోదావరి జిల్లాలు గట్టిగా దెబ్బ వేసాయి వైసీపీ పార్టీకి.


అయితే ఈ క్రమంలో రాబోయే ఎన్నికలలో త్రిముఖ పోటీ గట్టిగా ఉన్న నేపథ్యంలో జగన్ వైసీపీ పార్టీ తరఫున బలమైన నాయకులతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో తెలుగు సినిమా రంగానికి చెందిన దర్శకుడు వి.వి.వినాయక్ వైసీపీ పార్టీ లోకి రావడానికి ఉత్సాహంగా ఉన్నారు. గతంలో జగన్ దగ్గర వినాయక్ తన రాజకీయ ఆరంగేట్రం గురించి అనేక సార్లు చర్చించారు.


వీరిద్దరి కలయిక గురించి గతంలోనే వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తానని చెప్పినట్లుగా  అనేక వార్తలు కూడా వచ్చాయి అప్పట్లో. అయితే తాజాగా ఇటీవల వి.వి.వినాయక్ జగన్ ని మళ్ళీ కలిశారు. ఈ క్రమంలో జగన్ వి.వి.వినాయక్ రాజమండ్రి పార్లమెంటు స్థానం నుండి పోటీ చేయించాలని చూస్తున్నారు జగన్.


అంతేకాకుండా వినాయక్ సామాజిక వర్గం రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని ఏడు మండలాలలో అధికంగా ఉండటంతో జగన్ వినాయక్ వైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఈ సందర్బంగా వినాయక్ రాజమండ్రిలో అనేకసార్లు పర్యటించడం జరిగింది. మరి సినిమా రంగంలో రాణించినట్టు వి.వి.వినాయక్ రాజకీయ రంగంలో రాణిస్తారో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: