సోషల్ మీడియాలో అతి తక్కువ కాలంలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న వాళ్లు చాలా తక్కువ గా కనిపిస్తుంటారు.  అప్పటి వరకు వారి ఊరూ..పేరు తెలియదు..కానీ వారు చేసిన పనులు సోషల్ మీడియాలో రాగానే ఒక్కసారే పాపులర్ అవుతారు.  అలాంటి వారిలో కత్తి మహేష్ ఒకరు..మనోడు పవన్ కళ్యాన్ టార్గెట్ చేసుకొని ముందుక కదిలాడు..ఎక్కడ లేని ఇమేజ్ తెచ్చుకున్నాడు.  ముందు నుంచి ఊహించిందే జ‌రిగింది. సాధార‌ణ ఫిల్మ్ క్రిటిక్‌గా అంద‌రికీ సుప‌రిచితుడైన క‌త్తి మ‌హేశ్‌.. ఇప్పుడు రాజ‌కీయాల వైపు శ‌ర‌వేగంగా అడుగులు వేస్తున్నారు. జ‌న‌సేన అధినేత‌, ప‌వర్ స్టార్ పవ‌న్ క‌ల్యాణ్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లో నిలిచి ఫేమ‌స్ అయిపోయిన క‌త్తిమ‌హేశ్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీచేస్తాన‌ని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించాడు. త‌న సొంత జిల్లా అయిన‌ చిత్తూరు నుంచి పోటీచేస్తాన‌ని వెల్ల‌డించారు. అయితే ఆయ‌న ఏ పార్టీ నుంచి బ‌రిలోకి దిగుతాడ‌నేది మాత్రం స‌స్పెన్స్‌గా ఉంచారు. అయితే నెటిన్లు మాత్రం.. క‌త్తి మ‌హేశ్ వైసీపీ టికెట్ మీదే పోటీచేయ‌డం ఖాయ‌మ‌ని తేల్చేస్తున్నారు. అందుకు ప‌క్కా ఆధారాలు కూడా చెప్పేస్తున్నారు. 

Image result for YSRCP

బిగ్‌బాస్ షో మొద‌ల‌య్యే వ‌ర‌కూ క‌త్తి మ‌హేశ్ అనే వ్య‌క్తి సోష‌ల్ మీడియాలో కొంత మందికి మిన‌హా.. ఏపీలో చాలా మందికి తెలియ‌నే తెలియ‌దు. కానీ ఆ షోతో ఆయ‌న అంద‌రికీ ప‌రిచ‌య‌మ‌వ్వ‌డంతో పాటు మ‌రీ ముఖ్యంగా ప‌వ‌న్ అభిమానుల‌కు ఆయ‌న‌కు జ‌రిగిన చ‌ర్చ ఎంత‌టి ర‌చ్చ రచ్చ చేసిందో అంద‌రికీ తెలిసిందే! త‌ర్వాత ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా మ‌లుపులు తీసుకోవ‌డంతో.. జ‌న‌సేన సిద్ధాంతాల‌తో పాటు అడ‌పాద‌డపా టీడీపీ అవినీతిని కూడా ఆయ‌న ఎండ‌గ‌డుతూ.. సినిమా క్రిటిక్ కాస్తా.. పొలిటిక‌ల్ క్రిటిక్‌గా మారిపోయారు. అంతేగాక ఓవ‌ర్‌నైట్లోనే సెల‌బ్రిటీ అయి పోయాడు. ఏ చాన‌ల్ చూసినా ఆయ‌నే క‌నిపిస్తున్నాడంటే.. టీవీ చాన‌ళ్లు ఎంత ఫోక‌స్ పెట్టాయో అర్థం చేసుకోవ‌చ్చు! 

Image result for YS JAGAN

ఇన్నాళ్లు జ‌న‌సేన పార్టీని టార్గెట్ చేసుకుంటూ పాపులారిటీ సంపాదించుకున్న క‌త్తి మ‌హేశ్‌ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. త‌న‌ది చిత్తూరు జిల్లా అయినందున‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అక్క‌డి నుంచే పోటీ చేస్తాన‌ని అధికారికంగా ప్ర‌క‌ట‌న చేశాడు. ప్ర‌స్తుతం తాను అన్ని పార్టీల‌తో ట‌చ్ లో ఉన్నాన‌ని, అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేయ‌బోతున్న‌ది, ఏ నియోజ‌క‌వ‌ర్గం బ‌రిలో ఉండ‌బోతున్న దానిపై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటానన్నారు. అయితే ప‌లువురు నెటిజ‌న్లు మాత్రం క‌త్తి మ‌హేశ్ క‌చ్ఛితంగా వైసీపీ త‌ర‌పునే పోటీ చేస్తాడ‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. క‌త్తి మ‌హేశ్ తో ఎన్ని పార్టీలు ట‌చ్ లో ఉన్నా.. ఫైన‌ల్ గా టికెట్ ఇచ్చేది మాత్రం ఒక్క వైసీపీనేన‌ని అంటున్నారు.

Image result for AMBATI RAMBABU

ఏపీలో ప్ర‌ధానంగా ఉన్న‌వి టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన‌. వీటిలో జ‌న‌సేనపై పీక‌ల్లోతు ఆగ్ర‌హంతో ఉన్నాడు క‌త్తి మ‌హేశ్. ప‌వ‌న్ పై ప‌రోక్షంగా, ప్ర‌త్య‌క్షంగా వీలు దొరికిన‌ప్పుడ‌ల్లా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాడు. సో ఆయ‌న జ‌న‌సేన నుంచి పోటీ చేసే అవ‌కాశం లేదు. ఇక తెలుగుదేశంపై కూడా క‌త్తి ఆగ్ర‌హంతోనే ఉన్నారు. చంద్ర‌బాబుపై ఆయ‌న చేసే ట్వీట్లే అందుకు నిద‌ర్శ‌నం. ఇక మిగిలింద‌ల్లా వైఎస్సార్ సీపీనే. ఇప్ప‌టివ‌ర‌కు జ‌గ‌న్ పై క‌త్తి మ‌హేశ్‌ ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. పార్టీని ఎక్క‌డా విమ‌ర్శించింది లేదు. మొన్న ఢిల్లీలో హోదా కోసం వైఎస్సార్ సీపీ నేత‌లు చేప‌ట్టిన ధ‌ర్నాలో ప్ల‌కార్డుతో క‌నిపించాడు క‌త్తి మ‌హేశ్‌!! అంతేగాక వైసీపీ నేత అంబ‌టి రాంబాబుతో ఆయ‌న‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. వీట‌న్నింటినీ ప‌రిశీలిస్తే.. ఆయ‌న వైసీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగుతార‌ని స్ప‌ష్టంచేస్తున్నారు విశ్లేష‌కులు!! 


మరింత సమాచారం తెలుసుకోండి: