అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇంటా బయటా చిన్నారులను వేధించే వారి  సంఖ్య పెరుగుతోంది. అందుకే వీరి విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇక మేలుకోకపోతే.. చిన్నారుల బంగారు బాల్యం బుగ్గిపాలు అవ్వడం ఖాయం. తాజాగా వెలువడిన నేషనల్ క్రైమ్ రిజిస్టర్ బ్యూరో ఈ విషయం తేటతెల్లం చేసింది. 

Image result for child rapes
ఈ రికార్డుల ప్రకారం.. చిన్నారులపై జరిగిన నేరాల్లో దాదాపు 50 శాతం కిడ్నాపులు ఉన్నాయట. ఆ తర్వాత స్థానంలో చిన్నారులపై ఆత్యాచారాలు, లైంగిక వేధింపులు ఉన్నాయట. ఈ నివేదిక ప్రకారం 2016లో ఆచూకీ గల్లంతైన చిన్నారుల సంఖ్య దాదాపు లక్షా 12 వేల మంది ఉన్నారు. ఈ తరహా నేరాల్లో 16 శాతం రేటుతో బెంగాల్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. 

Image result for child rapes
ఓవరాల్ గా చూసుకుంటే 2015-16 మధ్య కాలంలో చిన్నారులపై నేరాలు 11 శాతం పెరిగాయట. 2015లో 94 వేల 172 కేసులు నమోదు అయ్యాయి. 2016లో ఆ సంఖ్య లక్షా 6 వేల 958కి చేరింది. బాలలపై నేరాల్లో 50 శాతం ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్ , బెంగాల్ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయట. 

Image result for child rapes
ఇక వృద్ధుల విషయానికి వస్తే.. వృద్దులపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ వరుసగా 4,5 స్థానాల్లో ఉన్నాయట.  అయితే ఈ జాబితాలో 15 శాతం నేరాలతో ఉత్తర్ ప్రదేశ్  అగ్రస్థానంలో నిలవగా...14 శాతంతో మహారాష్ట్ర రెండో స్థానం...13 శాతంతో మధ్యప్రదేశ్  మూడోస్థానంలో నిలిచినట్లు నివేదికలో వెల్లడైంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: