అవును! ఇప్పుడు ఏ ఇద్ద‌రు క‌లిసినా.. ఇటు ఏపీలోను, అటు తెలంగాణ‌లోనూ ఇదే టాపిక్‌పై చ‌ర్చించుకుంటున్నారు. ప‌వ‌న్ బాగా ముదిరిపోయాడు! అనే అంటున్నారు. ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో ఉన్న‌వారితో పోల్చుకుంటే అత్యంత జూనియ ర్ అయినప్ప‌టికీ.. ప్ర‌జ‌ల్లో గ‌ట్టి ప‌ట్టు, ఆద‌ర‌ణ ఉన్న నేప‌థ్యంలో ప‌వ‌న్‌కు పాప్యులారిటీ ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే, దీనిని ఆయ‌న త‌న ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నందునే ఎక్క‌డిక‌క్క‌డ స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. 2009 నుంచి రాజ‌కీయాల్లో ఒకింత ఉన్న‌ప్ప‌టికీ.. 2014లో ప్ర‌శ్నిస్తానంటూ.. సొంత‌గా పార్టీ పెట్టినప్ప‌టి నుంచి ప‌వ‌న్ రేటింగ్ భారీగానే పెరిగింది. మ‌రో ప్ర‌త్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న ఏపీ, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ప‌వ‌న్ ఓ చ‌క్క‌ని నేత‌గా క‌నిపించాడు. 

Image result for ap special status

ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ ఎక్క‌డికి వెళ్లినా ఆద‌ర‌ణ పెరుగుతూనే వ‌చ్చింది. అయితే, కొన్ని సంద‌ర్భాల్లో ప‌వ‌న్ చేసిన అత్యు త్సాహ‌పు వ్యాఖ్య‌లు ఆయ‌న ప‌రువును నిలువునా తీసేశాయి. ఇక‌,తాను పార్టీ పెట్టింది అధికారం కోసం కాద‌ని, సీఎం ప‌ద‌వి కావాలంటే అనుభ‌వం ఉండాలని ఇలా సంబంధం లేని వ్యాఖ్య‌ల‌తో ప‌వ‌న్ చేసిన కామెంట్లు అంద‌రినీ చిర్రెత్తించాయి. ఇక‌, ఇప్పుడు తాజాగా ఏపీకి ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల అమ‌లు విష‌యంపై కేంద్రంలో ఏపీకి చెందిన అధికార‌, విప‌క్షాలు రెండూ కూడా పెద్ద ఎత్తున విరుచుకుప‌డుతున్నాయి. కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వంతో నిన్న మొన్న‌టి వ‌ర‌కు చెలిమి చేసిన టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు సైతం ఇప్పుడు ప్లేట్ మార్చి ఏపీ కోసం ఉద్య‌మ బాట ప‌ట్టారు. అవ‌కాశం ఉన్న ప్ర‌తి సందర్భంలోనూ కేంద్రాన్ని ఏకేస్తున్నాడు. 

Related image

మ‌రి ఈ స‌మ‌యంలో ప్ర‌శ్నిస్తానంటూ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏం చేయాలి?  కుదిరితే ప్ర‌శ్నించాలి. కుద‌ర‌క‌పోతే కామ్‌గా అయినా ఉండాలి. కానీ, వీటికి విరుద్ధంగా ఆయ‌న నోటికి వ‌చ్చిన‌ట్టు మాట్లాడుతుండ‌డమే అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తున్న విష‌యం. రెండేళ్ల కింద‌ట చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లి ప్ర‌త్యేక హోదా స్థానంలో ప్యాకేజీకి త‌లూపి.. కేంద్రం చెప్పిన‌ట్టు న‌డుచుకున్న విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలోనే స్పందించిన ప‌వ‌న్‌... ప్యాకేజీని పాచి పోయిన ల‌డ్డూల‌తో పోల్చారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా రావాల్సిందే... కావాల్సిందే.. అని భీష్మించాడు. ఎక్క‌డ స‌భ పెడితే అక్క‌డ హోదా కోసం ప్ర‌త్యేక కామెంట్లు సైతం కుమ్మ‌రించాడు. ఈ నేప‌థ్యంలోనే అప్ప‌టి కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు పైనా విరుచుకుప‌డ్డారు. 

Image result for jenasena

ఇక‌, అప్ప‌ట్లో హోదా వ‌ద్ద‌ని, అదేమ‌న్నా సంజీవ‌నా? అన్న చంద్ర‌బాబు అదే హోదా కోసం ఇప్పుడు ఢిల్లీలో విజృం భిస్తున్నారు. కేంద్రంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌రి ఈ స‌మ‌యంలో ప‌వ‌న్ ఏ విధంగా మాట్లాడాలి?  హోదా కోసం ఆయ‌న కూడా త‌న శైలిలో పోరాట‌మో.. ఆరాటమో చేయాలి. కానీ, దీనికి విరుద్ధంగా ప‌వ‌న్‌.. ఏపీకి హోదాతో ప‌నిలేదు, నిధులు ఇస్తే చాలంటూ వ్యాఖ్య‌లు చేశారు.
Image result for national media
జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో తాజాగా ప‌వ‌న్ చేసిన ఈ వ్యాఖ్య‌ల వెనుక అచ్చంగా బీజేపీ ఉంద‌నే వ్యాఖ్య‌లు సైతం వ్యాపించాయి. ఏదేమైనా ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం అంద‌రూ ప‌నిగ‌ట్టుకుని ఆందోళ‌న‌ల‌కు దిగుతున్న త‌రుణంలో ప‌వ‌న్ ఇలా వ్యాఖ్యానించ‌డంతో అంద‌రూ ఇప్పుడు ప‌వ‌న్... బాగా ముదిరిపోయాడుగా?!- అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మ‌రి కొంద‌రు అయితే ప‌వ‌న్ జాతీయ ముదురు కాదు.. అంత‌ర్జాతీయ ముదురు అని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: