లోక్ సభలో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది.  ఈ రోజు కూడా నిన్నటి పరిస్థితులే మళ్లీ పునరావృతమయ్యాయి.మంగళవారం ఉదయం ప్రారంభమైన కొన్ని క్షణాలకే సభ వాయిదా పడింది. మంగళవారం ఉదయం సభ మొదలైన వెంటనే ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు స్పీకర్ ప్రయత్నించగా అన్నాడీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు ఆందోళనలు మొదలుపెట్టారు. కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే, రిజర్వేషన్లపై రాష్ట్రాలకు స్వేచ్ఛ అంటూ టీఆర్ఎస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకువచ్చి నినాదాలు చేశారు.
Image result for lok sabha
దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ సుమిత్రా మహజన్. రాజ్యసభలో ఆందోళన లోక్‌సభలో తరహలో కూడ రాజ్యసభలో కూడ గందరగోళం నెలకొంది. కాగా, రోహింగ్యాల సమస్యపై రాజ్యసభలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటన చేశారు. ఇరాక్‌లో గల్లంతైన 39 మంది భారతీయులు చనిపోయారని సుష్మాస్వరాజ్ ప్రకటించారు.
Image result for lok sabha
మృతదేహలను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు.బాగ్దాద్‌లో 39 భారతీయులను ఐసిస్ తీవ్రవాదులు కాల్చి చంపారని ఆమె ప్రకటించారు.

మరోవైపు టీడీపీ, వైసీపీ ఎంపీలు ఈరోజు కూడా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసులు అందజేశారు. కాగా సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో అవిశ్వాస తీర్మానం నోటీసుపై ఈరోజు అయినా చర్చ జరుగుతుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: