తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేప్పట్టినప్పటి నుంచి ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు.  ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఉన్న పేద ప్రజల కోసం కొత్త కొత్త పథకాలు తీసుకు వచ్చారు.  తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడమే తన ముఖ్యలక్ష్యం అని అంటున్నారు కేసీఆర్.  అంతే కాదు హైదరాబాద్ ని విశ్వనగరంగా మార్చడానికి అహర్శిశలూ ప్రయత్నిస్తున్నారు. 
Image result for telangana gurukulam
తెలంగాణ లో విద్యావ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. తాజాగా 2018-19 విద్యా సంవత్సరానికిగాను తెలంగాణ రాష్ట్రంలోని 204 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు ఆన్ లైన్ అడ్మిషన్ ప్రక్రియ మొదలైంది. 5వ తరగతిలో అన్ని సీట్లను, 6,7,8,9 తరగతుల్లో బ్యాక్‌లాగ్ సీట్లను భర్తీ చేస్తారు.  ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే వారికి కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు గల విద్యార్థులు ప్రవేశాలకు అర్హులు.
Image result for telangana gurukulam
ఫొటో, ఆధార్ కార్డ్ తో ఏప్రిల్ 20 లోగా ఆన్‌లైన్ ద్వారా tmreis.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.దరఖాస్తులు అధికంగా వస్తే ఏప్రిల్‌ 28న లక్కీ డ్రా ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఏప్రిల్ 30 నుంచి మే 5 వరకు సర్టిఫికేట్లు పరిశీలిస్తారు.

అయితే 75 శాతం సీట్లను మైనార్టీ విద్యార్థులతో, 25 శాతం సీట్లను మైనార్టీయేతర విద్యార్థులతో భర్తీ చేస్తారు. మరిన్నివివరాలకు హైదరాబాద్ నాంపల్లి హజ్‌హౌస్‌లో ఫెసిలిటేషన్ సెంటర్‌లో సంప్రదించవచ్చు. హెల్ప్‌లైన్ నంబర్ 040-23437909కు ఫోన్ చేయవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: