ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో  ప్రత్యేకహోదా విషయం ట్రెండింగ్ అవుతుంది. మన రాష్ట్ర ఎంపీలు సైతం ఢిల్లీలో గళమెత్తుతున్నారు. గత రెండురోజులుగా టీడీపీ, వైసీపీ పార్టీలు పార్లమెంటులో అవిశ్వాసంపై నోటీసులిచ్చినా తెరాస, అన్నాడీఎంకే పార్టీలు రచ్చచేస్తున్నాయనే నెపంతో స్పీకర్ అవిశ్వాసానికి సంబంధించి చర్చను వాయిదావేస్తున్నారు. తాజాగా ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత మరియు దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ హోదాపై స్పందించారు.


తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ- అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 29 సార్లు ఢిల్లీకి వెళ్తే మోడీ  అపాయింట్ మెంట్ ఇవ్వలేదనటం కేవలం తన ఆత్మగౌరవం మాత్రమే కాదు, ప్రతి తెలుగువాడి ఆత్మగౌరవం దెబ్బతిందన్నారు. మోడీ ఆయనకు   అపాయింట్‌మెంట్ ఇవ్వకపోయినప్పటికీ చంద్రబాబు ఆ మాట చెప్పడం తప్పు అని ఆయన వ్యాఖ్యానించారు.


ఆయన ఇంకా మాట్లాడుతూ- ఒక రాష్ట్రానికి ముక్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రధాని దగ్గరకి  వెళితే కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వరా ఎవడండీ ప్రధాని ? ముఖ్యమంత్రిని  లోపలికి రానీయకుండా ఉండటానికి వాడికెంత ధైర్యం ఉండాలి? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని లోపలికి రానీయకుండా చేయడం యావత్ తెలుగు రాష్ట్రప్రజలను అవమానించడమే అని ఆయన అభిప్రాయపడ్డారు. అన్నిసార్లు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా చంద్రబాబు ఎన్డీఏలో ఎందుకు కొనసాగారని ఆయన ప్రశ్న సంధించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: