మెగస్టార్ చిరంజీవి ఒకప్పుడు తెలుగు సినిమా రంగాన్ని చాలాకాలం నెంబర్ వన్ హీరోగా ఎల్లడం జరిగింది. ఈ క్రమంలో 2009 సార్వత్రిక ఎన్నికలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు చిరంజీవి. సామాజిక న్యాయం, సమాజంలో మార్పు అన్న నినాదంతో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ప్రజల్లోకి తీసుకువెల్లడంలో ఘోరంగా విఫలం అయ్యారు.


ఈ సందర్భంగా 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరపున 18 సీట్లు గెలిచారు. దీంతో చిరంజీవి అధికారం దక్కకపోవడంతో పార్టీ అనవసరం అనుకున్నారో ఏమో కానీ… ప్రజారాజ్యానికి మూడేళ్లు కూడా నిండకుండానే 2011 ఆగష్టులో కాంగ్రెస్‌లో విలీనం చేశారు. దానికి ప్రతిగా రాజ్యసభ సభ్యత్వం తీసుకున్న చిరంజీవి తర్వాత కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. యూపీఏ-2 క్యాబినెట్ లో పర్యాటకశాఖ మంత్రిగా పనిచేశారు.


కానీ చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే …. కేంద్రం ఆంధ్రప్రదేశ్ ను విభజించింది. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర నినాదం చేతపట్టుకొని చిరంజీవి అప్పట్లో రాజకీయాలు చేశారు. అయితే తర్వాత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో  పూర్తిగా ఏ ఒక్క స్థానంలో గెలవకుండా ఓడిపోయింది. ఈ క్రమంలో చిరంజీవి కొద్ది కొద్దిగా రాజకీయాలకు దూరం అయ్యి మళ్ళీ సినిమా రంగానికి దగ్గరయ్యారు.


ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలపడే అవకాశాలు కూడా లేకపోవడం….అలాగే రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగుస్తుండడంతో చిరంజీవి ఇంకా పూర్తిగా రాజకీయాలలోకి వెళ్లకుండా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: