వందల మాటల్లో చెప్పలేని భావాన్ని ఒక్క చిత్రం పలికించగలుగుతుంది. అందుకే పొలిటికల్ కార్టూన్లకు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. తెలుగులో కార్టూన్లను డైనమేట్లలా పేల్చే కార్టూనిస్టులు ఎందరో ఉన్నారు. తాజాగా  సాక్షి పత్రికలో వచ్చి చంద్రబాబు క్యారికేచర్ అదిరిపోయింది. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని జగన్ నుంచి చంద్రబాబు కాపీ కొట్టారంటూ వచ్చిన కథనానికి వన్నె తెచ్చింది. 


వాస్తవానికి ప్రత్యేక హోదా నినాదంతో ఏపీ ప్రతిపక్షనేత జగన్ దాదాపు రెండేళ్ల నుంచి ఉద్యమం నడుపుతున్నారు. పాపం.. చాలా చోట్ల భారీ సదస్సులు పెట్టారు. విద్యార్థులతో సభలు సమావేశాలు నిర్వహించారు. అప్పట్లో చంద్రబాబు అండ్ కో.. దాన్ని ఎద్దేవా చేశారు. అలాంటి సభలను అడ్డుకునే ప్రయత్నాలు చేశారని కూడా వైసీపీ నేతలు చెబుతారు. 

clip
అలాంటిది ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు ప్రత్యేక హోదా తమ జన్మహక్కు అంటూ చంద్రబాబు వీరలెవల్లో లెక్చర్లు దంచేస్తున్నారు. ప్రత్యేక హోదా సాధించేవరకూ విశ్రమించబోమంటూ శపథాలు చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు పోరాటాన్ని ఆయన అనుకూల మీడియా ఆకాశానికెత్తుతోంది. దీంతో అసలు ప్రత్యేక హోదా కోసం ఉద్యమం ప్రారంభించిందే చంద్రబాబు అన్న లెవల్లో ఆ కథనాలు ఉంటున్నాయి.



తమ ఉద్యమాన్ని చంద్రబాబు హైజాక్ చేయడంతో వైసీపీలో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రత్యేక హోదా కోసం జగన్ చేసిన పోరాటాలు ఎక్కడ జనం మరిచిపోతారోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా సాక్షి పత్రిక బ్యానర్ కథనం ప్రచురించింది. వైఎస్ జగన్ టీవీలో ప్రసంగిస్తుంటే.. చంద్రబాబు చూసి రాసుకుంటున్నట్టుగా వేసిన కార్టూన్ బాగా పేలింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: