తెలంగాణా అధికారపక్షానికి తెలంగాణా రాష్ట్రానికి తమ విధానాలు తమ కున్నాయని, తామెరి ఆదేశాలను ప్రత్యక్షంగాకాని పరోక్షంగాకాని అనుసరించబోమని తెలంగాణాకు తమ అత్మగౌరవ విలువలు బాగా తెలుసని దానికెన్నడూ హాని తలపెట్టబోమని తెలంగాణా రాష్ట్ర సమితి పార్లమెంట్ సభ్యులు సంఘటితంగా ఉద్ఘాటించారు. ఎవరి పెత్తనాన్ని సహించబోమని అన్నారు. 

నూతన తెలంగాణ రాష్ట్రము లో తాము ప్రజల ప్రయోజనాల కోసమే ప్రధానంగా పోరాడుతున్నట్లు టీఆర్‌ఎస్‌ ఎంపీలు స్పష్టం చేశారు. తెలంగాణ ఎవరి మోచేతి నీళ్ళు తాగదు. ఎవరి ఆధిపత్యానికో పడిఉండే చేతగాని రాష్ట్రం కాదన్నారు. తమ రాజకీయస్వార్థంలో భాగంగా తెలంగాణా ప్రజల మద్దతు పొందేందుకు ఆంధ్ర ప్రదేశ్ చెందిన రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. 
Image result for trs mps in lok sabha
ప్రభుత్వంపై అవిశ్వాసమం పెట్టటమంటే పసిపిల్లల ఆటలు కాదన్నారు. టీడీపీ, వైసీపీల అవిశ్వాసంపై స్పందిస్తూ 'పక్కింట్లో పెళ్లయితే మాఇంటికి రంగులేసుకుంటామా?' అని కఠినంగానే వ్యాఖ్యానించారు. తమ పార్టీ  "గుణాత్మక మార్పు" అనే ఒక ప్రత్యేకమైన స్థిరమైన అజెండాతో ముందుకు వెళుతుందన్నారు. రిజర్వేషన్ల పై రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పించేంతవరకు తమ ఆందోళన పోరాటం కొనసాగుతుందని టీఆర్‌ఎస్‌ లోక్‌ సభా పక్ష నేత జితేందర్‌ రెడ్డి ఉద్ఘాటించారు. పార్లమెంటు రెండో విడత బడ్జెట్‌ సమావేశాల ప్రారంభమైన రోజు నుంచీ తాము ఆందోళన చేస్తున్నామని, కేంద్రం నుంచి స్పష్టమైన హామీ లభించేవరకు తమ పోరాటం ఆపేది లేదని అంటూ, తమపై అన్యాయంగా భుద్దిమాలి చౌకబారు విమర్శలు చేయొద్దని హెచ్చరించారు. 
Image result for trs mps in lok sabha
అవిశ్వాసంపై టీఆర్‌ఎస్‌ ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని విలేకర్లు అడగ్గా.."పక్కింట్లో పెళ్లయితే మా ఇంటికి రంగులేసుకుంటామా?" అని భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ అత్యంత ఘాటుగా సమాధానం ఇచ్చారు. తమను ఎవరూ ఆదించలేరని, తమకు ఎవరూ నేపధ్యంలో లేరని "కేసీఆర్‌ను ఎవరో ఆడిస్తున్నారు" అని అన్న విమర్శకు, ఆయనే ఎవరినైనా ఒక ఆట ఆడించగలరని ఆయన్ను ఎవరూ ఆడించలేరని తెలుసుకోవాలని హెచ్చరించారు. అయినా తమతో ముందుగా చర్చించకుండా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెడితే తామెలా మద్దతిస్తామని తిరిగి ప్రశ్నించారు. అంతా వరిస్థమెనా? మెమేమన్నా వారి సామంతులమా? అలా అనుకొని ఉంటే తమ విధానం ఇప్పటికైనా మార్చుకోవాలని అన్నారు.  
Image result for trs mps in lok sabha
గత 12 రోజుల నుంచి తాము తీవ్రంగా పార్లమెంట్లో ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టిన అనుభూతి లేదని టిఆరెస్ ఎంపీ సీతారాంనాయక్‌ ఆరోపించారు. ఇచ్చిన హామీ ప్రకారమే తాము రిజర్వేషన్ల పై పార్లమెంటు సాక్షిగా గొంతెత్తామని ఎంపీ బాల్క సుమన్‌ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు రాష్ట్ర సమస్యలపై మంగళవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ను కలిశారు. సమస్యలపై మంత్రి మండలిలో చర్చించి చెబుతామని రాజ్‌ నాథ్‌ వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీలు మీడియాతో మాట్లాడారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి తమ నిరసన అడ్డంకి కాదని ఎంపి వినోద్‌ తెలిపారు. స్పీకర్‌ కు చిత్తశుద్ధి ఉంటే మద్దతిచ్చే వారి పేర్లు అడిగి మరీ చర్చకు తీసుకొచ్చే అవకాశము ఉందన్నారు. దన్నారు.

Image result for trs mps in lok sabha

మరింత సమాచారం తెలుసుకోండి: