ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా తెలుగుదేశంపై భారతీయ జనతా పార్టీకి అపనమ్మకం అనుమానం ఏర్పడిందని తన మనసులో మాటను స్పష్టం చేశారు. కానికి దీనికి కారణమైన పూర్వాపరాలను ఆయన వివరించలేదు. అదే జరిగి ఉంటే సమస్యలు పటాపంచలు అయిఉండేవి. నిజానిజాలు బట్టబయలై ఉండేవి. 

చివరిరోజు వరకు తాము కేంద్రంపై అవిశ్వాసం విషయంలో ఇదే పోరాట స్పూర్తి ని అనుసరిస్తామని అన్నారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తమ పార్టీ ఎంపీలకు దానికి తగిన దిశా నిర్దేశం చేశారు. తమ ఆదేశాలను సుస్పష్టం చేసినట్లు చెప్పారు.  కేంద్రంపై అవిశ్వాసం విషయంలో చివరివరకు పోరాటాన్ని కొనసాగించాలని చంద్రబాబు పార్టీ ఎంపీలను కోరారు. అవిశ్వాసం విషయంలో ఇతరపార్టీల సభ్యులతో సమన్వయ పరచుకొని తగిన విధంగా ప్రవర్తించాలని చంద్ర బాబు నాయుడు కోరారు.
Image result for bjp lost its confidence on chandrababu & his government
ఏపీ రాష్ట్రంలో ఎన్టీఆర్‌ ను గతంలో ముఖ్యమంత్రి పదవినుండి తప్పించిన ఆగష్టు సంక్షోభం సమయంలో 161మంది ఎమ్మెల్యేలు ఆనాడు ఎన్టీఆర్‌కు అండగా నిలిచా రని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కూడ టిడిపి ఎంపీలు అదే రకమైన పోరాటస్పూర్తిని కొనసాగిస్తున్నారని చంద్ర బాబు నాయుడు అభిప్రాయపడ్డారు.  బాబు బుధవారం టిడిపి ఎంపీ లతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. పార్లమెంట్ ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీలకు దిశా నిర్ధేశం చేశారు. 
 
కొంత కాలంగా బిజెపి రాష్ట్రం లోని టిడిపిపై ఆ పార్టీ నాయకత్వంపై అనుమానాలను పెంచుకొందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. అయితే బిజెపి అనుమానా లకు కారణాలేమిటి అనే విషయాన్ని బాబు ప్రస్తావించ కుండా దాటవేసి రాష్ట్ర అవసరాలే తమకు ముఖ్యమని ఉద్ఘాఠించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎంతటి త్యాగాని కైనా సిద్దమేనని, వాటి తో రాజీపడబోమని బాబు చెప్పారు.
Image result for bjp lost its confidence on chandrababu & his government
తనకు జాతీయ రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి అసలే లేదని కొన్ని రోజులుగా తాను జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేయనున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని, రాష్ట్రాన్ని అభివృద్ది చేయటమే తాను ప్రథాన లక్ష్యంగా పెట్టుకొన్నట్లు  చంద్రబాబు నాయుడు చెప్పారు.  రాష్ట్రంలో ఈమద్య టిడిపిని ఇరుకునబెట్టి ఇబ్బంది పెట్టేందుకు బిజెపి చాలా ధారుణంగా ప్రయత్నాలు చేస్తోందని నాయుడు అభిప్రాయపడ్డారు. బిజెపి రాష్ట్రానికి ఇచ్చిన హమీలను అమలు చేయకపోవడాన్ని ఆయన గర్హించారు.

కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందనే భావన ప్రజల్లో ఉందని చంద్రబాబు పార్టీ ఎంపీలతో చెప్పారు. అవిశ్వాసానికి బిజెపి మినహ అన్ని పార్టీలు మద్దతుగా నిలుస్తున్నా యని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక హోదా విషయమై చేస్తున్న ఏపి ఎంపిల పోరాటం ప్రస్తుతం "జాతీయ సమస్య" గా మారిందని, అందుకే జాతీయ పార్టీలు కూడ ప్రత్యేక హోదా విషయమై సానుభూతిగా ఉన్నారని అన్నారు. మరో వైపు తనకు ఎవరిపై ద్వేషంగాని, కోపంగాని లేవని చంద్రబాబు చెపుతూ, వైసీపీదీ మాత్రం లాలూచీ రాజకీయ మని చెపుతూ ముగించారు. 

Image result for bjp lost its confidence on chandrababu & his government

మరింత సమాచారం తెలుసుకోండి: