"మేం ఏసీ రూముల్లో కూర్చొని కులుకుతామని టీడీపీ నాయకులు అంటున్నారు. అవును, మేం వెధవలం. మాకు ఏదీ చేతకాదు. మరి మీరేం చేస్తున్నారు? 

ప్రత్యేక హోదా కోసం విజయవాడలో దీక్షకు వచ్చిన సినిమా వాళ్లని లాఠీలతో కొట్టించింది మీరుకాదా? అయితే నాదో ప్రశ్న.
ప్రత్యేక హోదా కోసం విజయవాడలో ఎందరో దీక్ష చేశారు. చలసాని శ్రీనివాస్ లాంటి వాళ్లు దీక్ష చేస్తే మీరెందుకు లాఠీలతో కొట్టించారు?

వాళ్ల చొక్కాలు చిరిగేదాకా ఎందుకు కొట్టారు?

ప్రత్యేక హోదా కోసం ఇంత తపించిపోతున్న రాజేంద్రప్రసాద్ గారు, చంద్రబాబు గారు,  అదే హోదా కోసం పోరాడుతున్న ఈ ప్రజల్ని ఎందుకు వెంటపడి కొట్టించారు? అంటే మీరు చెత్తగాళ్లా?  బేవార్స్ గాళ్లా?  రాజకీయ బ్రోకర్సా?’ 

ఒక్కొక్కరినీ తరిమి తరిమి కొట్టిన సంగతి మర్చిపోయారా? 

నిన్నటిదాకా మీరేం మాట్లాడారు? 

ప్రత్యేక హోదా కోసం మాట్లాడిన వాళ్లను చెత్త వెధవలని అనలేదా? 

మళ్లీ మీరిప్పుడు సడన్‌ గా హోదా కావలంటుంటే మేం మద్దతివ్వాలా?" 
Image result for tdp mlc babu rajendra prasad Vs Posani krishna murali
"అసలు ప్రత్యేక హోదానే వద్దని చంద్రబాబు చెబితే మనస్ఫూర్తిగా నమ్మాం. ఒక ముఖ్యమంత్రి చెప్పే మాటల్లో నిజం ఉంటుందని హోదా కన్నా ప్యాకేజీనే ముద్దు" అను కున్నాం. అంటూ పోసాని ఊగిపోయారు.

"ఇప్పుడు మోదీతో చంద్రబాబుకు ఏవో గొడవ లొస్తే అదేదో ఏపీ ప్రజల సమస్యగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్‌? 

అప్పుడేమో ప్యాకేజీ, ఇప్పుడేమో ప్రత్యేక హోదా అంటూ మాట తప్పిన వాళ్లను "లోఫర్‌" అనే కదా అంటారు? 
ఎస్సీల్లో పుట్టాలని కోరుకోరుకదా! అని చంద్రబాబు అంటే మేం జేజేలు కొట్టాలా? డబ్బిచ్చి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుకుక్కుంటే సంతోషంగా మద్దతు పలకాలా? 

బ్రోకర్‌ చంద్రబాబు మాటలు నమ్మి మేం పోరాటాలు చెయ్యాలా?" 

అని పోసాని ఫైర్‌ అయ్యారు. ప్రశ్నల వర్షం శరపరంపరగా కురిపించారు. టాలీవుడ్‌పై విమర్శలు గుప్పించిన తెలుగుదేశం నేతలపై నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి పై విధంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా పోరాటానికి తెలుగు సినీ పరిశ్రమ మద్దతు తెలపడం లేదని, బస్సుల్లో పడుకుని మరీ సీఎం చంద్రబాబు ఏపీని అభివృద్ధి చేస్తుంటే, టాలీవుడ్‌ వాళ్లు మాత్రం డబ్బు మత్తులో జోగుతున్నారన్న టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్‌కు దిమ్మతిరిగేలా కౌంటర్‌ ఇచ్చారు.
Image result for tdp mlc babu rajendra prasad Vs Posani krishna murali
ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ ఆంధ్ర ప్రజలకు పోరాటాలు కొత్త విషయం కాదని, నాయకులు నాడు "జై ఆంధ్రా!" అన్నా, నిన్న  "సమైక్యాంద్రా!" అన్నా, నేడు "ప్రత్యేక హోదా!" మద్యలో "ప్రత్యేక పాకేజీ అన్నా!" ఎలాంటి  పిలుపిచ్చినా జనం స్పందించి, రోడ్ల మీదికి వచ్చారని, అయితే అన్ని సందర్భాల్లోనూ పాలకులు మోసం చేశారని పోసాని గుర్తుచేశారు. 


ఈ మద్య ప్రత్యేక హోదా కోసం విజయవాడలో ఆందోళన చేసిన టాలీవుడ్ వాళ్లని పోలీసులొచ్చి లాఠీలతో వీపులుపగలగొట్టారు! ఎందుకంటే అప్పుడు  ముఖ్య మంత్రి  చంద్రబాబు కు గానీ, టీడీపీకి గానీ హోదా అవసరం రాలేదు. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీనే మంచిదని చంద్రబాబు చెబితేనే టాలీవుడ్‌ అంతా నిశ్శబ్ధంగా ఉండిపోయాం. 

Image result for posani krishna murali ferocius reply

నంది అవార్డులపై లొల్లి చేసిన తెలుగు సినీ కళాకారులు ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదని తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ మండిపడిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌పై తీవ్ర వాఖ్యలు చేసిన రాజేంద్రప్రసాద్‌కు నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి దిమ్మతిరిగే విధంగా పై కౌంటర్ రిటార్ట్ ఇచ్చారు. తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. "అప్పుడేమో ప్యాకేజీ, ఇప్పుడేమో ప్రత్యేక హోదా"  అంటూ తమ అవసరాలకు తగ్గట్టు క్షణానికి ఒక మాట మాట్లాడే నిలకడ లేని వాళ్లని, తరచుగా తప్పే వాళ్ళని  "లోఫర్స్"  అంటారని నిప్పులు చెరిగారు. ఈ మేరకు వార్తా ఛానెల్‌ తో పోసాని మాట్లాడారు.


టాలీవుడ్‌ వాళ్లు మాత్రం డబ్బు మత్తులో జోగుతున్నారన్న టీడీపీ ఎమ్మెల్సీ బాబూరాజేంద్రప్రసాద్‌ కు దిమ్మతిరిగేలా కౌంటర్‌ ఇచ్చారు.

Lokesh Boozes With Girls Only Says Posani - Sakshi

మత్తులో జోగుతున్నది సినిమావాళ్లన్న అంటున్నారని.. అసలు మత్తులో జోగుతోంది ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ అని అన్నారు. లోకేష్‌కు సంబంధించిన పలు చిత్రాలను చూపుతూ, ఆయన కేవలం అమ్మాయిలతోనే మందు తాగు తారని, విదేశాల్లో టేపుతో అమ్మాయిల నడుమును కొలుస్తారని అన్నారు.


స్విమ్మింగ్‌ పూల్‌లో అమ్మాయిలతో గడుపుతూ మందుతాగి, సినిమావాళ్ల కన్నా నీచంగా ప్రవర్తించింది మీనేతే అనే విషయాన్ని రాజేంద్రప్రసాద్‌ తెలుసుకోవాలని అన్నారు. ఎదుటివారిని విమర్శించే ముందు కొంచెం తెలివితో మాట్లాడాలని హితవు పలి కారు.


ఇప్పటికైనా ప్రత్యేక హోదా రావాలంటే ఒకే ఒక్క దారి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగు దేశం మంత్రులు, తెలుగు దేశం పార్లమెంట్ సభ్యులు, తెలుగుదేశం శాసనసభ సభ్యులు, తెలుగుదేశం శాసనమండలి సభ్యులు అందరికీ అందరూ విజయవాడ నడిబొడ్డున నిరాహారదీక్షకు దిగుదాం.  టాలీవుడ్‌ తరఫున నేనూ ఆమరణదీక్షకు కూర్చుంటాను. మళ్లీ చెబుతున్నా! ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగానికి కూడా నేను సిద్ధం. టీడీపీ నేతలు అంతా కూడా సిద్దమైతే కదలి రండి. అలా కాకుండా నోటి కొచ్చినట్లు కూస్తే మాత్రం నేను సహించను అని పోసాని అన్నారు.

Image result for tdp mlc babu rajendra prasad

మరింత సమాచారం తెలుసుకోండి: