వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇటీవల ప్రధాని కార్యాలయంలో మీడియాకు తెలియకుండా వెళ్లడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అధికార పార్టీ తెలుగుదేశం నేతలు అవినీతి కేసులు కొట్టించుకోవడం కోసం రహస్యంగా ప్రధానిని కాలుస్తున్నారని ఆరోపించడం జరిగింది. ఈ ఆరోపణలు రావడంతో విజయసాయిరెడ్డి తాను ఎందుకు ప్రధానిని కలిశారో చెప్పడం జరిగింది. ఒక రాజ్యసభ సభ్యుడిగా ప్రధానిని కలిసే అవకాశం నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని తెలిపారు.


విభజనకు గురైన రాష్ట్రం అనేక సమస్యలతో ఉంటే రాజ్యసభ సభ్యుడిగా ప్రధానికి రాష్ట్ర సమస్యలు గురించి చెప్పుకోవడం నా పదవిలో కర్తవ్యం అంటూ తెలిపారు...పనిలోపనిగా ఇంత అన్యాయంగా విభజించిన రాష్ట్రాన్ని దోచుకుంటున్న చంద్రబాబును కూడా కడిగేశారు. అంతేకాకుండా చంద్రబాబును జైలుకు పంపే వరకూ ప్రధానమంత్రిని కలుస్తూనే ఉంటానని నేరుగానే ప్రకటించారు.


అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు చేస్తున్న అవినీతి పైన కేంద్రం నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. చంద్రబాబు రాష్ట్రంలో చేస్తున్న అవినీతి పైన కేంద్రం ఆపరేషన్ గరుడను  ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తొందరలోనే నేరుగా చంద్రబాబుపైన కాకుండా టీడీపీ ఆధ్వర్యంలో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై ముందు సిబిఐ దాడి చేసి….తర్వాత చంద్రబాబును టచ్ చేయాలని చూస్తున్నారు కేంద్ర నిఘా సంస్థ వారు.


కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగడుగునా అవినీతి జరుగుతోందని రాష్ట్రం నుండి చాలా నివేదికలు అందాయట. అంతేకాకుండా ఇటీవల కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు లెక్క అడిగితే చంద్రబాబు సరైన లెక్కలు చెప్పకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: