ప్రస్తుతం దేశంలో సగం రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇంతగా విజయపథంలో దేశంలో సగం రాష్ట్రాలలో దూసుకెళ్ళిపోతున్న బిజెపికి అసలు బలం డిజిటల్ మీడియా అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో గత ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోడీకి డిజిటల్ మీడియా చాలా సహకరించింది. గత ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీకి…. కారణజన్ముడున్నట్లుగా ఇమేజ్ క్రియేట్ చేసింది కూడా సోషల్ మీడియానే. ఆ ఇమేజ్ తోనే ఓట్లు కొల్లగొట్టి ప్రధాని అయ్యారు.


అయితే ఈ క్రమంలో సోషల్ మీడియాలో బిజెపి పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న వారు ఫేక్ అని తేలింది…బీజేపీకి, మోదీకి ఉన్న సోషల్ మీడియా అకౌంట్లలో అరవై శాతం వరకూ ఫేకేనని ఇటీవలే ఓ వాస్తవం బయటకు వచ్చింది. దాంతో అందరూ నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. కొన్ని లక్షల ఫేక్ అకౌంట్లతో వారు చేసుకున్న ప్రచారాన్ని చూసి ప్రజలు కూడా నివ్వెరపోయారు.ఇప్పుడు అంతకు మించిన బ్లాస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.


అదే కేంబ్రిడ్జ్ ఎనలిటికా స్కాం. కృత్రిమ అకౌంట్లతో ప్రజల అభిప్రాయాలను మార్చేందుకు ఈ సంస్థ… అన్ని రకాల సోషల్ మీడియా పద్దతుల్లో ప్రచారం చేసి పెడుతుంది. ఈ సంస్థ అమెరికా అధ్యక్ష ఎన్నికలలో 5 కోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల వ్యక్తిగత అకౌంట్లతో రాజకియా ప్రచారం చేసింది.


అయితే ఇదే సంస్థ గత ఎన్నికలలో బిజెపి పార్టీకి కూడా పని చేసిందని ఆరోపణలు వస్తున్నాయి...ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఈ సంస్థ చేసిన స్కాంలో ఈ విషయం బయటపడింది. దీంతో ఈ అంతర్జాతీయ స్కాంలో బిజెపి పార్టీ కూడా ఇరుక్కుంది. రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత వివరాలను తప్పుడుగా ఇచ్చి ప్రజలను ప్రభావితం చేయడం ఫేస్ బుక్ నిబంధనలకు విరుద్ధం...దీంతో ఈ వివాదం అంతర్జాతీయ స్థాయిలో ముదురుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: