జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయాడు. ఈ సందర్భంగా తాను చెప్పిన మాటలను ఎప్పటికప్పుడు సందర్భానుసారంగా మార్చుకుంటూ ముందుకు వెళుతున్నాడు. గతంలో అవిశ్వాసం పెట్టండి నేను దేశం మొత్తం తిరిగి మద్దతు తీసుకొస్తాను అన్న పవన్...తిరా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాక ఏమీ మాట్లాడకుండా ప్రేక్షకపాత్ర వహించడం ఇందుకు నిదర్శనం.


ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో..ప్రశ్నించడం కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్….మాటలు మారుస్తూ ప్రజలను మభ్యపెడుతూ ముందుకెళుతున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవతర రాజకీయం చూస్తాది  అన్న పవన్ కళ్యాణ్...రాష్ట్రంలో కేంద్రంలో ఏం జరుగుతుందో ఎలా వ్యవహరించాలో తెలియకుండా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.


ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తాను తప్పు చేస్తే తన మాటలను మీడియా వక్రీకరిస్తుందని మీడియా మీద మండిపడుతున్నారు. ఇటీవల ఓ ప్రముఖ జాతీయ మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంత అవసరం లేదు అంటూ చెప్పటం జరిగింది పవన్...అయితే ఈ క్రమంలో తన ఇంటర్వ్యూలోని అంశాలను వక్రీకరిస్తున్నారంటూ.. ఆయన మీడియా గురించి వ్యాఖ్యానిస్తున్నారు.


తమ మాటలపై తమకే క్లారిటీలేని ప్రతివారికీ.. మీడియా వక్రీకరిస్తున్నదని నిందలు వేయడం ఒక్కటే ఆల్టర్నేటివ్ కింద కనిపిస్తున్నట్లుగా ఉంది. ఆ మేరకు ఆయన ట్వీట్ చేయడాన్ని మించిన మార్గంలేదని నమ్ముకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా కేంద్రం హోదాతో సహా రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రతిదీ ఇచ్చి తీరాల్సిందేననే డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: