సుధీర్, రష్మీ.. ఈ  జంటపై ఎన్ని రూమర్లో.. ఎన్ని సెటైర్లో... ప్రేక్షకులు మీడియా సెటైర్లు, రూమర్ల కంటే సొంత ప్రోగ్రామ్ జబర్దస్త్ లోనూ వీరి జోడీపై కామెంట్లు తక్కువేమీ కాదు.. వీరిద్దరిపై వచ్చే వచ్చే స్కిట్లు చూస్తే వీరు భవిష్యత్తులో పెళ్లి చేసుకోవడం ఖాయం అన్న రేంజ్ లో ఉంటాయి. అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఉగాది రోజు ఈటీవీలో ప్రసారమైన ప్రత్యేక కార్యక్రమం.. బుల్లితెర అభిమానుల్లో కలకలం సృష్టించింది. 


ఈ ప్రోగ్రామ్ ప్రోమో కొన్ని రోజుల ముందు నుంచే సంచలనం సృష్టించింది. సుధీర్, రష్మి పెళ్లి చేసుకోబోతున్నారని.. అందుకు వారిద్దరూ రోజానూ, నాగబాబును ఆహ్వానించినట్టు రూపొందించిన ప్రోమో చూసి చాలా మంది వీరు పెళ్లి చేసుకోబోతున్నారేమో అనుకున్నారు కూడా. అయితే వాళ్ల పెళ్లి అనే కాన్సెప్టుతో రూపొందించిన స్పెషల్ ప్రోగ్రామ్ అని తర్వాత తెలిసి ఆశ్చర్యపోయారు. 

Image result for rashmi gautam SUDIGALI SUDHEER
ఐతే.. దీనిపై రష్మి, సుధీర్ లను అభిమానుల నుంచి బుల్లితెర ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఇది ప్రేక్షకులను మోసం చేయడమే అని కొందరు అంటే.. అబ్బే ఈ షో చాలా బాగా వచ్చింది. మేం ఎంజాయ్ చేశామని మరికొందరు అన్నారు. అయితే ఈ షోను విమర్శించిన వారికి రష్మీ కూడా గట్టిగానే ట్విట్టర్లో బదులిచ్చింది. ఓ ప్రేక్షుకుడు.. మీరు ప్రేక్షకులను వెర్రివాళ్లను చేస్తున్నారు. వాళ్ల ఫీలింగ్స్‌తో ఆడుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని మరో విధంగా శిక్షిస్తాడు అంటూ ఫైర్ అయ్యారు. 

Image result for rashmi gautam HOT
ఆయన ట్వీట్ కు స్పందించిన రష్మి.. తెరపై నటించే వాళ్లందరూ అన్నిసార్లు పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదని బదులిచ్చింది. ప్రతీ విషయంలోనూ దయ చేసి తమను ఒత్తిడి చేయవద్దని కోరింది. తాను సుధీర్‌ నటించిన ఏ ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమం వల్ల కానీ, సామాజిక మాధ్యమాల వేదికలపైన కానీ ప్రేక్షకులను వెర్రి వాళ్లను చేసిన దాఖలా ఉందా అని ప్రశ్నించింది. సుధీర్ , తాను వృత్తి పరంగా మేం మంచి స్నేహితులమని.. తాను ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఎవరితో డేటింగ్‌ చేయాలన్నది మా వ్యక్తిగత వ్యవహారమని తేల్చి చెప్పేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: