ఔనా.. నిజమా.. ఏపీ సీఎం చంద్రబాబు పేరు చెబితే చాలు నరేంద్ర మోడీ వణికిపోతున్నారు. ఆయన ఎక్కడ తన సీటుకు ఎసరు పెడతాడోనని నరేంద్ర మోడీ భయపడిపోతున్నాడు. ఏపీని అర్థంతరంగా వదిలేసి.. జాతీయ రాజకీయాల్లోకి దూసుకొచ్చేసి ఎక్కడ పీఎం సీటు లాక్కుంటాడో చంద్రబాబు అని నరేంద్రమోడీ విపరీతంగా భయపడిపోతున్నాడా.. అవునట.. 

Image result for chandrababu national
అవును.. ఇదంతా మీడియా సృష్టి కాదు.. నేరుగా ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిందే.. కాకపోతే.. మరీ ఇంత డైరెక్టుగా కాదు.. కాస్త ఇన్ డైరెక్టుగా చంద్రబాబు ఆ మాటే చెబుతున్నారు. ఎంపీలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్సులో ఇలాంటి కామెంట్లు చంద్రబాబు చేశారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొంతకాలంగా టీడీపీపై బీజేపీ అనుమానం పెంచుకుందట. 

Image result for chandrababu naional
అసలు జాతీయ రాజకీయాల పట్ల తనకు ఆసక్తి లేదని నేరుగా చంద్రబాబే చెబుతున్నా.. నరేంద్ర మోడీ అండ్ కో ఏ మాత్రం నమ్మడం లేదట. ఈ విషయం కూడా చంద్రబాబే చెప్పారు. అంటే ఏంటి.. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వస్తాడు.. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వస్తే మోడీ ఫ్యూచర్ కు ప్రమాదం.. అందుకే ఆయన్ని అర్జంటుగా అణగొక్కేయాలని కమలదళం కుట్రపన్నిందా.. 

Image result for chandrababu naional
ఈ విషయాన్ని చెప్పాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారా.. అదే నిజమైతే.. అసలు అలాంటి సీన్ ఉందా.. ఇలాంటి అనుమానాలు తలెత్తుతున్నాయి. పోనీ.. చంద్రబాబు ఏమైనా జాతీయ రాజకీయాల కోసం ప్రయత్నించారా.. ఆ సమాచారం అందడం వల్లే బీజేపీ ఇలా చంద్రబాబుపై కక్ష సాధిస్తోందా.. ఏదీ అర్థంకాని పరిస్థితి.. కానీ మొత్తానికి ఏదో జరిగిందని చంద్రబాబు వ్యాఖ్యలే చెబుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: