జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణకు సంబంధించి సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేరు అందరికీ తెలిసిందే.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీబీఐ జేడీగా హడలెత్తించిన ఐపీఎస్‌ అధికారి లక్ష్మీ నారాయణ నిజాయితీ గల ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఆయన నిర్వర్తించిన విధులు ఎవరూ మర్చిపోలేరు. జగన్ కేసులు మాత్రమే ఎమ్మార్ ప్రాపర్టీస్, సత్యం కుంభకోణం ఇలా పలు కీలక కేసులను చేపట్టి.. నిర్భయంగా దర్యాప్తు పూర్తి చేశారు.
Image result for jd laxminarayana chandrababu
లక్ష్మీనారాయణ తర్వాతి అడుగు ఎటు వైపు అన్నది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ముంబై అడీషనల్ డీజీపీ వీవీ లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఆయన సీబీఐ జేడీగా ఏపీలోను విధులు నిర్వర్తించారు.

తెలుగు వ్యక్తి అయిన లక్ష్మీనారాయణ ఐపీఎస్ ఆఫీసర్‌గా పలు కీలక బాధ్యతులు చేపట్టారు. ఆ మద్య ఐపీఎస్ వదిలి రాజకీయాల్లోకి వస్తున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన జేడీ లక్ష్మీనారాయణ తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. 

తనకు ఇంకా 12 ఏళ్ల ప్రభుత్వ సర్వీసు ఉందని ఆయన తెలిపారు.  అలాంది ముంబై అడీషనల్ డీజీపీ వీవీ లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేయడంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే వీవీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తే..టీడీపీ నుంచా..లేక పవన్ కళ్యాన్ స్థాపించిన జనసేనలోకి వెళ్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. కాగా, వీవీ లక్ష్మీనారాయణ సిన్సియర్ ఆఫీసర్లు రాజకీయాల్లోకి వస్తే..రాజకీయ ప్రక్షాణళన జరుగుతుందని ఆయన అభిమానులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: