దేశ రాజకీయాల సంగతి దేవుడెరుగునేమో కాని రాష్ట్ర రాజకీయాలు మాత్రం గంటకో మలుపు చొప్పున అసలు తరువాత ఎలాంటి మలుపు ఉండబోతుందో ఊహించడానికి సైతం సాధ్యపడకుండా మారుతూ వస్తున్నాయి. ప్రత్యేకహోదాకోసం టీడీపీ, వైసీపీలు బీజేపీపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టినా అసలు ఆవిషయం చర్చకు రాకుండా బీజేపీ ప్రభుత్వం వాయిదాల పేరుతో సభను అడ్డుకుంటూ ఆంధ్రా ఎంపీల పోరాటాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. 


తాజాగా పార్లమెంటు వద్ద అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వాఖ్యలు వైసీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. నిన్న సభ వాయిదా పడ్డాక ఆయన మీడియాతో మాట్లాడుతుండగా వైసీపీ ప్రస్తావన వచ్చింది. వాళ్ళు కూడా ఇక్కడికి రానివ్వండి "నీయబ్బ మీకు పార్లమెంటులో స్థలం లేదు పార్లమెంటు ఆవరణలో చోటు లేదు, ఇంటికి వెళ్ళండి" అని చెప్తా అని వాఖ్యానించారు. 


వైసీపీ వారు ఆయన ఉన్నచోటికి రాగానే మీరిక్కడనుండి వెళ్లిపోండి, మీ ఇంటికిపోండి. ఇది మేము  ఆక్రమించుకున్నాము మీరెక్కడైనా వెళ్లి నిరసనలు తెలపండి అంటూ గట్టిగా అరిచి వారిని తరిమేశారు. దీంతో అక్కడున్న వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి .. చాలు  చాలు! నువ్వు మా దగ్గరికి వచ్చే టైం వస్తుంది అంటూ కౌంటర్ వేశాడు. దీంతో ఫక్కున నవ్వడం ఆయన వంతయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: